జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను గులాబీ బాస్ కేసీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా సంజయ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఎమ్మెల్యే తండ్రి, ప్రముఖ న్యాయవాది హనుమంత రావు (85) ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హనుమంత రావు న్యాయవాదిగా పని చేశారు.
కేసీఆర్ వెంట హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు నాయకులు ఉన్నారు..