జలుమూరు మండలం ఎన్నికల ప్రచారంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
జలుమూరు : జగనన్న ప్రభుత్వంలో మీ కుటుంబానికి జరిగిన మేలును రానున్న ఎన్నికల్లో ఓటు వేసి మద్దతు పలకాలని మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పార్టీ అధ్యక్షులు , నరసన్నపేట సిట్టింగ్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం జలుమూరు మండలం, మర్రివలస, కరకవలస పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో పేద ప్రజలకు ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ద్వారా ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఎన్ని అబద్ధపు హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. గతంలో దొంగ హామీలు ఇచ్చి మహిళలను, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. ఎన్నికల హామీలో ఇచ్చిన మానిఫెస్టో ను 99 శాతం అమలు చేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్క ఓటరూ ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో చేపట్టిన ప్రచారానికి ప్రజలు నుండి విశేష స్పందన లభించింది. ఈ ప్రచార కార్యక్రమంలో యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, సీఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియ పాల్గొని ఇంటింటా తిరిగి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయమని అభ్యర్థించారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎంపీపీ వాన గోపి, మాజీ ఎంపీపీ బగ్గు రామకృష్ణ, వైస్ ఎంపీపీ తంగి మురళీ కృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు కనుసు సీతారాం, మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితులు పైడి విటల్ రావు, పిఎ సిఎస్ అధ్యక్షులు మొజ్జాడ శ్యామలరావు, పాగోటి రాజప్పలనాయుడు, యువజన నాయకులు బగ్గు గౌతమ్, జేసీఎస్ కన్వీనర్ ధర్మాన జగన్ మార్కెట్ కమిటీ చైర్మన్ పెరుమాళ్ల తవిటినాయుడు, దాము మన్మధరావు, వెలమల అసిరినాయుడు, బోర సింహాచలం, యువజన విభాగం అధ్యక్షుడు జుత్తు నేతాజీ, కోన దాము తోపాటు స్థానిక సర్పంచ్ బగ్గు లక్ష్మణరావు, రమణ, సీపాన మోహనరావు, బసవ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.