గుడివాడ బ్యూరో ప్రతినిధి : గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి ఎన్నికల ప్రచారం 12రోజుకు చేరుకుంది . 1వ వార్డు ఎమ్మెల్యే కొడాలి నాని నిర్వహించిన గడపగడపకు ప్రచారంలో, వీధి వీధినా ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలినానికు నాగవరప్పాడు సెంటర్లో వైఎస్ఆర్సిపి శ్రేణులు, ప్రజానీకం గజమాలలతో ఘన స్వాగతం పలికారు. శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని ప్రచారాన్ని ప్రారంభించారు. ఒకటవ వార్డులోని ఎస్బీఐ బ్యాంకు రోడ్, కాకతీయనగర్, హోసన్నా చర్చి రోడ్, బైపాస్ రోడ్, పాత ఎస్బీఐ బ్యాంకు రోడ్ లోయ వారి వీధుల్లో ప్రజలకు అభివాదాలు చేస్తూ గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు. వార్డులోని హోసన్న మినిస్ట్రీస్ చర్చిలో ఎమ్మెల్యే కొడాలి నాని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ పెత్తందారుల పక్షాన చంద్రబాబు, దుష్ట కూటమి నిలబడి పోరాడుతుంటే పేదల పక్షాన సీఎం జగన్ ఒంటరిగా పోరాడుతున్నారన్నారు. ఎన్ని శక్తులు ఏకమైన ప్రజా నేత జగన్ కు దేవుడు దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం ఎవరూ ఏమీ చేయలేరని ఎమ్మెల్యే కొడాలి నాని స్పష్టం చేశారు. మోసగాళ్లంతా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని, మంచి చేసిన సీఎం జగన్ కు మద్దతిచ్చేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే నాని పిలుపునిచ్చారు. మ్యానిఫెస్టోను పవిత్ర గ్రంథం గా భావించి 99శాతం అంశాలను అమలు చేశామని కొడాలి నాని అన్నారు. 2014లో చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలో 10% అంశాలైన అమలు చేసి ఉంటే వాటిని చెప్పాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో 1వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, గుడివాడ నియోజకవర్గ పరిధిలో గుడివాడ టౌన్, రూరల్, గుడ్లవల్లేరు మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ విభాగాల నాయకులు, కొడాలి నాని అభిమానులు పాల్గొన్నారు.