సెంట్రల్ నియోజకవర్గంలో పలు చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న వెలంపల్లి శ్రీనివాసరావు
పలు చోట్ల వాకర్స్ తో మాటామంతి పాల్గొన్న వెలంపల్లి
57, 62వ డివిజన్ లో ఓట్లు అభ్యర్థించిన వెలంపల్లి అల్లుడు
విజయవాడ సెంట్రల్, బ్యూరో ప్రతినిధి : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న పలు చర్చిల్లో ఆదివారం ప్రత్యేక ప్రార్ధనల్లో సెంట్రల్ నియోజకవర్గం వైస్సార్సీపీ సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. చర్చి పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేసి వెలంపల్లికి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్బంగా వెలంపల్లి మాట్లాడుతూ లోకరక్షకుని ఆశీస్సులు వైసీపీ ప్రభుత్వం పై ఉండాలన్నారు. నేను ఒక సేవకుడిగా ఉంటానని, సీఎం జగన్ ప్రభుత్వంలో క్రైస్తవుల అభ్యున్నత పట్ల ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మోదుగుల తిరుపతమ్మ, గణేష్, కొంగితల లక్ష్మీపతి, ఇసరపు రాజు, జానారెడ్డి కొండపల్లి బుజ్జి, వాసా బాబు, వడ్డేపల్లి సామ్రాజ్యం, స్థానిక వైసిపి నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు.
పలు చోట్ల వాకర్స్ తో మాటామంతిలో పాల్గొన్న వెలంపల్లి : హలో అన్నా..బాగున్నారా అంటూ ఆత్మీయ పలకరింపుతో ఆదివారం పలు చోట్ల వాకర్స్ తో మాటామంతిలో వెలంపల్లి పాల్గొన్నారు. సెంట్రల్ నియోజక వర్గంలోని ఇందిరా గాంధీ స్టేడియం,స్టేట్ గేస్ట్ హౌస్ రోడ్,లోటస్ ల్యాండ్ మార్క్,గాంధీ నగర్ లలో వాకర్స్ తో చిట్ చాట్ విత్ వాకర్స్ కార్యక్రమం లో వాకర్స్ తో నడుస్తూ,షటిల్ క్లబ్, యోగా క్లబ్,బాస్కెట్ బాల్ ప్లేయర్స్ తో సమస్యలు తెలుసుకుంటూ మాటా మంతి లో పాల్గొన్న పాల్గొన్నారు.
57, 62వ డివిజన్ లో ఓట్లు అభ్యర్థించిన వెలంపల్లి అల్లుడు : వైఎస్ఆర్సిపి సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ అల్లుడు మంచుకొండ చక్రవర్తి తదితర కుటుంబ సభ్యులు 57వ డివిజన్ కార్పొరేటర్ ఇసరపు దేవి, రాజు తో కలిసి స్థానిక రాజరాజేశ్వరి పేట తదితర ప్రాంతాలలో పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి వెలంపల్లి శ్రీనివాసరావు ని ఆదరించి గెలిపించాలని కోరారు. 62వ డివిజన్ కార్పొరేటర్ అలంపూరు విజయలక్ష్మి, విజయ్ తో కలిసి స్థానిక రాధనగర్ తదితర ప్రాంతాలలో పర్యటించి వెలంపల్లి శ్రీనివాసరావు ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో57, 62వ డివిజన్ వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వెలంపల్లి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఇఫ్తార్ విందులో పాల్గొన్న వెలంపల్లి : సెంట్రల్ నియోజక వర్గం 63వ డివిజన్ స్థానిక సుందరయ్య నగర్ లో గల నురే మహమ్మదీయ మజీద్ లో అదివారం నాడు జరగిన ఇఫ్తార్ విందులో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని ప్రత్యేక నమాజ్ చేసిన ఆనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని ఉపవాసం చేసిన మైనారిటీ సోదరులకు పళ్ళు తినిపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా, మోదుగుల గణేష్, ఖాదర్, మస్జీద్ కమిటీ సభ్యులు, మైనారిటీ సోదరులు పాల్గొన్నారు.