బాబు పాలనలో ప్రజల స్థూల ఆదాయం రూ.1.68లక్షలు
జగన్ పాలనలో రూ.2.34లక్షలకు పెరిగింది
నాడు 11 శాతం ఉన్న పేదరికం నేడు 4శాతానికి తగ్గింది
విద్య, వైద్యానికి జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు
సుజనా చౌదరి బాగోతాలన్నీ బయటపెడతా
విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)
విజయవాడ ప్రధాన ప్రతినిధి : సంపద సృష్టిస్తా…పేదలకు పంచుతా అని చంద్రబాబు చెప్పడం పెద్ద బూటకమని విజయవాడ ఎంపీ, వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్(నాని) అన్నారు. చంద్రబాబు పాలన కన్నా నేడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రంలో అన్ని విధాల అభివృద్ధి పెరిగిందని, ప్రజల ఆదాయం పెరిగిందని, పేదరికం తగ్గిందని ఆయన చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్‌తో కలిసి ఆయన ఆదివారం 43వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాల ద్వారా అందిన లబ్ధిని వివరించారు.
ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో ప్రజల స్థూల వార్షిక ఆదాయం రూ.1.68లక్షలు కాగా, అదే సీఎం జగన్ పాలనలో రూ.2.34లక్షలకు పెరిగిందని తెలిపారు. అదేవిధంగా చంద్రబాబు హయాంలో కన్నా రెండేళ్లు కరోనాతో ఇబ్బందిపడినా జగన్ పాలనలో జీఎస్డీపీ రెండు శాతం అధికంగా నమోదైందని వివరించారు. చంద్రబాబు పాలనలో పేదరికం 11శాతం ఉండగా, జగన్ పాలనలో 4శాతానికి తగ్గిందని, దేశంలో ఏకంగా 7 శాతం పేదరికాన్ని తగ్గించిన గొప్ప నేత వైఎస్ జగన్ అని ప్రశంసించారు. దీనిని బట్టి ఎవరి పాలనలో ప్రజల ఆదాయం పెరిగింది, సంపద ఎవరు సృష్టిస్తారనేది స్పష్టంగా అర్థమవుతోందన్నారు. సీఎం వైఎస్ జగన్ వైద్య రంగానికిరూ.18వేల కోట్లు, విద్యా రంగానికి రూ.14వేల కోట్లు ఖర్చు చేసి ఆస్పత్రులు, పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దారని తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు, సుజనా చౌదరి అసత్య ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. సుజనా చౌదరి ప్రత్యేక విమానంలో కృష్ణా నది పక్కన దిగి, అక్కడి నుంచి రోల్స్ రాయల్స్ కారులో తిరిగితే పశ్చిమ నియోజకవర్గ పరిస్థితులు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ఇది పేదలు నివాసం ఉండే ప్రాంతమని చెప్పారు. తమకు ఎల్లో మీడియా అండగా ఉందని సుజనా చౌదరి అబద్ధాలు ప్రచారం చేస్తే తాను ఆయన 25ఏళ్లుగా చేసిన అవినీతి భాగోతాలన్ని బయటపెడతానని హెచ్చరించారు. వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ తమకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభిస్తోందని చెప్పారు.
సీఎం జగన్ సంక్షేమ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ లబ్ధిని వివరించి ఓట్లు అభ్యర్థిస్తున్నామని, అదే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రజలకు చేసిందేమీ లేకపోవడంతో చెప్పుకోవడానికి ఏమీ లేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. స్థానికుడనైన తాను ఇక్కడి ప్రజల అండ, ఆశీర్వాదాలతో తప్పకుండా విజయం సాధిస్తానని ఆసిఫ్ ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయనభాగ్యలక్ష్మి, స్థానిక కార్పోరేటర్ బాపతి కొట్టిరెడ్డి, విశ్వబ్రాణ కార్పోరేషన్ మాజీ చైర్మన్ తోలేటి శ్రీకాంత్, కార్పోరేటర్లు చైతన్య రెడ్డి, మరుపిళ్ల రాజేష్, మాజీ కార్పోరేటర్ బట్టిపాటి సంధ్యారాణి, సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాసరావు, నాయకులు అత్తులూరి పెద్దబాబు, మైలవరపు దుర్గారావు, బట్టిపాటి శివ, కట్టా సతయ్య, ఇరువురి నర్సారెడ్డి, మాదాల తిరుపతిరావు, అన్నపురెడ్డి కృష్ణ రెడ్డి, సూరసాని రామిరెడ్డి, మంగం ఆత్మరాం, కంది శ్రీనివాస రెడ్డి, దూది బ్రమయ్య, కనకం వెంకటేశ్వర్లు, మద్దెల రామకృష్ణ, అల్లం భువన్, బేవర నాగేశ్వరరావు, దేవిరెడ్డి ఆంజనేయ రెడ్డి, ఎస్వి రెడ్డి, కేసరి రాజశేఖర్ రెడ్డి, చందుబోయిన సుబ్బారెడ్డి, ఓగిరాల రమణ రెడ్డి, ఇరువురి పేర రెడ్డి, ఏవీ. నారాయణ రెడ్డి, కంది నారాయణ రెడ్డి, మద్దు బాలు, జీ. మహేంద్ర రెడ్డి, వాసుపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.