వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత
కమలాపురం బ్యూరో ప్రతినిధి : రాజకీయంగా అడ్డొస్తున్నారని వైఎస్ వివేకాను హత్య చేశారని ఆయన కుమార్తె సునీత ఆరోపించారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమెకు మద్దతుగా సునీత ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ‘‘మంచి మనిషి, సౌమ్యుడైన వివేకానంద రెడ్డిని హత్య చేశారు. ప్రతీకారం తీర్చుకోవాలంటే ఏదైనా చేయొచ్చు. కానీ నేను పద్ధతి ప్రకారమే వెళ్తున్నాను. ఇది నా వ్యక్తిగత సమస్య కానేకాదు. అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వివేకా అంశంపై మాట్లాడారు. ఎర్ర గంగిరెడ్డి ఏదో చేస్తుంటే అమాయకంగా అవినాష్ రెడ్డి చూస్తున్నారట. సాక్ష్యాలు తారుమారు చేస్తుంటే ఆయన అంత అమాయకంగా ఎందుకు చూడాలి? ఆయన ఏమైనా పాలు తాగే పిల్లాడా? బాధ్యత లేదా.? ఇంట్లో వాళ్లకు ఘోరం జరిగితే పట్టించుకోనివాళ్లు ప్రజల గురించి ఏం పట్టించుకుంటారు? మీకోసం పనిచేసే షర్మిలను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని ప్రజలను కోరారు.