విజయవాడ బ్యూరో ప్రతినిధి : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని శివనాథ్ (చిన్ని ) బిజెపి టిడిపి జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి సుజనా చౌదరి కెనాల్ రోడ్డు వద్ద ఉన్న వినాయకుని ఆలయంలో ప్రత్యేకత పూజలు నిర్వహించి అనంతరం ఇంద్రకీలాద్రి బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఉత్తరాంధ్ర ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న,మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా సుజనా చౌదరిని శాలువాతో సత్కరించి గజమాలతో ఘన స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వచనాలతో దుర్గమ్మను దర్శించిన అనంతరం భవానిపురం శివాలయం సెంటర్ వద్ద టిడిపి, బిజెపి, జనసేన పార్టీ నాయకులు శ్రేణులతో కలిసి ఎన్నికల ఉమ్మడి పార్టీ కార్యాలయాన్ని సుజనా చౌదరి ప్రారంభించారు. మెడలో పసుపు కండువాలు ధరించి సుజనా కి తెలుగుదేశం పార్టీ మహిళలు కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు. అనంతరం ఊర్మిళ నగర్ వద్ద చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.