సంగారెడ్డి జిల్లా లో కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి మృతి చెందిన ఘటనలో బాధిత 4 కుటుంబాలకు అండగా నిలిచిన మంత్రి దామోదర రాజనర్సింహ .
బాధితుల ఒక్కొక్కరికి 40 లక్షల రూపాయలు నష్టపరిహారం అందించేలా కంపెనీ యాజమాన్యంతో చర్చించి ఆమోదింపచేశారు .
బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు వారి కుటుంబంలో అర్హులైన ఒక్కొరికి స్థానికంగా ఉన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు .
సంగారెడ్డి జిల్లా హత్నర మండలం చందాపూర్ గ్రామ శివారులో గల కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం జరిగిన ఘటన లో మృతి చెందిన కుటుంబాలకు అండగా నిలిచిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ. కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపి బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 40 లక్షల రూపాయల నష్టపరిహారం అందేలా కృషి చేశారు. తక్షణసాయంగా దహన సంస్కారాల కోసం 1 లక్ష రూపాయలను సంగారెడ్డి లోని తన నివాసంలో బాధిత కుటుంబాలకు అందజేశారు. మానవత్వంతో బాధితులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారు వ్యక్తిగతంగా ఒక్కో కుటుంబానికి 1 లక్ష రూపాయలను తక్షణసాయంగా అందించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మంత్రి దామోదర్ రాజనర్సింహ.