ఎన్టీఆర్ జిల్లా బ్యూరో ప్రతినిధి : ఎన్టీఆర్ జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు వైస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైస్సార్సీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు గురువారం నియోజకవర్గంలో స్థానిక 27వ డివిజన్ గులాబీ తోట తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ కొండాయగుంట మల్లేశ్వరి, తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్దిని వివరిస్తూ కరపత్రం అందచేసి ఓట్లను అభ్యర్ధించారు. డివిజన్ పర్యటనలో భాగంగా 27వ డివిజన్ పరిధిలో పర్యటించారు. వైస్సార్సీపీ హయాంలో డివిజన్ డివిజన్ అభివృద్ధి జరిగిందన్నారు. అందరికి అన్ని సంక్షేమ పధకాలు అందయని, ఈ ప్రాంత ప్రజలకు అమరావతి లో ఇల్లు ఇచ్చామని, అయితే చంద్రబాబు అక్కడ పేదవారు ఉండకూడదని అడ్డుకున్నారని గుర్తుచేశారు. ఖచ్చితంగా అక్కడ ఇల్లు ఇచ్చి తీరుతామన్నారు. అమరావతి లో పేద ప్రజలకు ఖచ్చితంగా ఇల్లు కట్టి ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, 27వ డివిజన్ సీనియర్ నాయకులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.