హైదరాబాద్: స్వాతంత్య్ర సమర యోధుడు, మాజీ ఉప ప్రధాన మంత్రి బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తి దాయకమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ 117వ జయంతిని పురస్కరించుకొని బాబూజీ సేవలను సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. అత్యంత పేదరికంలో జన్మించిన జగ్జీవన్ రామ్ అకుంఠిత దీక్షతో అత్యున్నత స్థానానికి ఎదిగారని పేర్కొన్నారు. జాతీయోద్యమంలో పాల్గొన్న ఆయన రాజ్యాంగ పరిషత్ సభ్యుని గానూ సేవలందించారని, స్వాతంత్య్రానంతరం తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ మంత్రి వర్గంలో తొలి కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి కార్మిక సంక్షేమానికి పాటు పడ్డారన్నారు. కార్మిక పక్షపాతిగా గుర్తింపు పొందిన బాబూజీ రెండు దఫాలు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గానూ సేవలు అందించారని తెలిపారు. దేశ వ్యాప్తంగా కరవు తాండవిస్తున్నప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా హరిత విప్లవం విజయ
కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. అంటరాని తనం, కుల వివక్ష నిర్మూలనకు బాబూజీ పోరాడారని, దళితుల అభ్యున్నతికి ఎంతగానో పాటు పడ్డారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగిస్తామన్నారు.*