ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
వాహన మిత్ర ద్వారా ఇప్పటివరకు రూ.1296 కోట్లు
తిరుపతి జిల్లా చిన్నసింగమలలో లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ ముఖాముఖి
తిరుపతి నుంచి ప్రత్యేక ప్రతినిధి : చంద్రబాబు కారణంగానే వృద్ధులు పింఛన్ కోసం ఎండలో నిలబడాల్సి వచ్చిందని, వలంటీర్లపై నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించింది టీడీపీనేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నాం తిరుపతి జిల్లా చిన్నసింగమలలో లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. టిప్పర్ డ్రైవర్‌కు సీటు ఇచ్చానని చంద్రబాబు అవహేళన చేశారు. టిప్పర్ డ్రైవర్‌ను చట్ట సభలో కూర్చోబెట్టేందుకే ఎమ్మెల్యేగా నిలబెడుతున్నా. ఒక టిప్పర్ డ్రైవర్‌కు టికెట్ ఇస్తే తప్పేంటి?. ఏం తప్పు చేశానని టీడీపీ నన్ను అవహేళన చేస్తోందని సీఎం జగన్ నిలదీశారు. వీరాంజనేయులు (శింగనమల నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి) ఎంఏ ఎకనామిక్స్ చదివాడు. చంద్రబాబు హయాంలో ఉద్యోగం రాకున్నా వీరాంజనేయులు బాధపడలేదు. ఉపాధి కోసం వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. టీడీపీలో కోట్ల రూపాయలు ఉన్నవారికే చంద్రబాబు సీట్లు ఇస్తున్నారని సీఎం జగన్ ప్రస్తావించారు. గత ఐదేళ్లుగా ఆటో, ట్యాక్సీ, టిప్పర్ డ్రైవర్లకు అండగా ఉంటున్నాం. ఏడాది రూ.10వేల చొప్పున ఈ ఐదేళ్లలో రూ. 50 వేలు సాయంగా ఇచ్చాం. వాహన మిత్ర ద్వారా ఇప్పటివరకు రూ.1296 కోట్లు ఇచ్చామని సీఎం జగన్ తెలిపారు.
నేను అడుగుతున్నా.. ఇదే చంద్రబాబును : అవునయ్యా జగన్ టిప్పర్ డ్రైవర్ కే సీటు ఇచ్చాడు. నువ్వు అవహేళన చేసేందుకు ఏం తప్పు చేశాడయ్యా? జగన్ అని అడుగుతున్నాను. నిజంగా నువ్వు చేయలేని పని, నువ్వు కోట్లు కోట్లు డబ్బులున్న పెత్తందార్లకు టికెట్లు ఇచ్చావు. నేను ఒక సామాన్యుడికి, ఒక పేదవాడికి పార్టీ తరపున నిలబెట్టించి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం నేను చేస్తున్నాను. సొంత ఆటోలు కొనుక్కుని, ఈరోజు ట్యాక్సీలు కొనుక్కుని నడిపేవారు ఎంత మందో తెలుసా? అక్షరాలా 3,93,655 మంది. తమ జీవితం మీద తామే కంట్రోల్ తీసుకుంటూ వేరే వాళ్ల మీద ఆధారపడకుండా చదువుకున్న వాళ్లే వీరంతా కూడా. కాస్తో కూస్తో పెట్టుబడి పెట్టేవాళ్లే వీళ్లంతా. వీళ్లంతా కూడా ముందుకు వచ్చి ఎవడో ఉద్యోగం ఇవ్వలేదనో, ఎవడో తోడుగా ఉండటం లేదనో భయపడకుండా తామంతట తామే సొంత ఆటో కొనుక్కుని, సొంత ట్యాక్సీ కొనుక్కుని తమ కుటుంబాలను పోషిస్తున్న వారు అక్షరాలా 3,93,655 మంది. మొట్ట మొదటి ప్రభుత్వం. ప్రతి సంవత్సరం కూడా ఫిట్ నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలంటే బండికి ఇన్సూరెన్స్ ఉండాలి. చిన్న చిన్న రిపేర్లు చేయించాలి. ఈ రెండూ చేపిస్తే తప్ప ఫిట్ నెస్ సర్టిఫికెట్ రాదు. ఫిట్ నెస్ సర్టిఫికెట్ రావాలి అంటే కనీసం అంటే రూ.10 వేలు ఇన్సూరెన్స్ కోసమని, రిపేర్ల కోసం అయినా గానీ ఖర్చు పెట్టి ఆ రూ.10 వేలు ముందే జమ చేసి, ఖర్చు పెట్టి అన్నీ చేస్తే తప్ప ఫిట్ నెస్ సర్టిఫికెట్ వచ్చే కార్యక్రమం జరగదన్నారు.
ఈ దఫా టిప్పర్ డ్రైవర్లకూ : మరి ఈ మాదిరిగా ఫిట్ నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలంటే ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు ఇంకా కాస్తా కూస్తో ఒక అడుగు ముందుకు వేసి ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సొంత టిప్పర్లు ఉన్న టిప్పర్ డ్రైవర్లను కూడా ఈ కేటగిరీలోకి తీసుకొస్తాం. వీళ్లందరికీ కూడా క్రమం తప్పకుండా మన ప్రభుత్వం ప్రతి సంవత్సరం వీళ్లకు తోడుగా, అండగా ఉందని చెబుతూ ఏకంగా 3,93,655 మందికి క్రమం తప్పకుండా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఈ 3,93,655 మందికి, వాళ్ల కుటుంబాలకు మంచి చేస్తూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వరుసగా ఆర్థిక ఆసరా అందిస్తున్నామన్నారు. వాహన మిత్ర అనే స్కీము తీసుకొచ్చి సొంత ట్యాక్సీ గానీ, సొంత ఆటో గానీ కొనుక్కుని తన జీవనం సాగిస్తున్న సొంతంగా చేసుకుంటున్న వాళ్లకు ఏకంగా ఈ 58 నెలల కాలంలో రూ.1.296 కోట్లు వాళ్ల చేతుల్లో పెట్టామన్నారు. స్వయం ఉపాధి రంగంలో వీళ్లంతట వీళ్లు స్వయం ఉపాధి పొందుతూ అడుగులు ముందుకు వేస్తున్నారు. ఎవరి మీదో ఆధారపడకుండా తమ కాళ్ల మీద తాము నిలబడుతూ తమ కుటుంబాన్ని తాము పోషించేందుకు అడుగులు ముందుకు వేస్తున్నారన్నారు.
వైసీపీఐ చేరిన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్టువర్ధన్ రెడ్డి : ఎద్దల చెరువు వద్ద బస్సుయాత్రలో తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్టువర్ధన్ రెడ్డి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అనుచరులుతో ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలు, కార్యక్తలనుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆహ్వానం పలుకుతున్నా. అందరినీ కలిసే పరిస్ధితి కష్టం అనేది ఆలోచన చేయమని కోరుతున్నా. ఎన్నికల ప్రచారం మధ్యలో ఉన్నాం కాబట్టి వెళ్లాల్సిన రూటు చాలా ఉంది. ప్రతి ఒక్కరినీ కలవలేకోయాం అని బాధపడవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు, పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. 6వ తేదీన కావలిలో “కావలి సిద్ధం” సభ మీ దగ్గరే జరుగుతుంది. మీ అందరినీ అప్పుడు వీలైనంతవరకు ఆ రోజు కలిపించమని విష్టుకు చెబుతున్నానన్నారు.