బాలాయపల్లి -వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
వైఎస్ఆర్ సీపీ లోకి వలసలు బాలాయపల్లి మండలం వెంగమాపురం గ్రామం నుండి టిడిపి నుంచి వైఎస్ఆర్సిపి లోకి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరణంగా ఆహ్వానించిన వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలాయ పల్లి మండలం వెంగమాపురం గ్రామ టిడిపి క్రియా శీలక నాయకులు గురవయ్య ,వెంకటరమణయ్య అనుచరులు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఎన్ శేషమ నాయుడు, ఆ గ్రామ సర్పంచ్ వెంకట సుబ్బయ్యల ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరారని తెలిపారు.రానున్న ఎన్నికల్లో వైఎస్సా ర్సీపీ ఘనవిజయానికి కార్యకర్తలు సమష్టిగా పనిచే యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మంలో వెంకటగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ వెందోటి.మధుసూదన్ రెడ్డి , జయంపు సొసైటీ అధ్యక్షుడు వి కార్తీక్ రెడ్డి, వైఎస్ఆర్సిపి జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు నెమళ్ళపూడి సురేష్ రెడ్డి, పల్లిపాటి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోటీ :-మాట్లాడుతున్న నేదురుమల్లి