నాగపూర్ సమీపంలోని చౌకీ సీతాబుల్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనాల కాల్చివేత కలకలం రేపింది. బోలె పెట్రోల్ పంప్ సమీపంలోని సున్నితమైన వసంతరావ్ నాయక్ స్లమ్ ఏరియాలో ముగ్గురు కానిస్టేబుళ్ల బైక్లను వారి పోలీస్ స్టేషన్ ఎదుటే తగులబెట్టడంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. 2012లో జరిగిన సామూహిక హింస తర్వాత తాజాగా వాహనాల కాల్చివేత సంచలనం కలిగించింది. అయితే ఈ ఘటన వెనక గ్యాంబ్లింగ్ ముఠా హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.