విజయవాడ బ్యూరో ప్రతినిధి : ఎన్టీఆర్ జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు వైస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైస్సార్సీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు సోమవారం నియోజకవర్గంలో స్థానిక 61వ డివిజన్ వాంబే కాలనీ హెచ్ బ్లాక్స్ తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి వెంకట్రావు తో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్దిని వివరిస్తూ కరపత్రం అందచేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్ధించారు.ఈ సందర్బంగా వెలంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 61వ డివిజన్ లో పర్యటించడం జరిగిందన్నారు. జగన్ వచ్చాక 3వేల రూపాయలపెన్షన్ ఇచ్చారు.పెన్షన్ ల పంపిణీకి చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ లు శిఖండిలా మారారన్నారు. నిమ్మగడ్డ రమేష్ ను అడ్డంపెట్డులొని కుతంత్రాలు పన్నుతున్నారన్నారు. నిమ్మగడ్డ,పురందేశ్వరి,పవన్ కళ్యాణ్ లు చంద్రబాబు కు పాలేరులా పనిచేస్తున్నారన్నారు.జగన్ ఇచ్చిన పధకాలు ఆపేయాలని నీచ రాజకియాలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్,పురందేశ్వరి పాల్పడుతున్నారన్నారు.నిమ్మగడ్డ రమేష్ కు వాలంటీర్ లకు సంబంధం ఏంటి అని ప్రశ్నించారు.వాలంటీర్లు లేకపోతే పెన్షన్ డబ్బులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మా సోదరి షర్మిలమ్మ సమాధానం చెప్పాలన్నారు. 60 లక్షల మంది పెన్షన్ దారులు చంద్రబాబు పైన తప్పకుండ కక్ష తీర్చుకుంటారన్నారు. ప్రతి నెల 1 వ తేదీ న వాలంటీర్ వెళ్లి పెన్షన్ ఇస్తారన్నారు.దుర్మార్గపు నీచ రాజకీయాలతో వృద్దులను వికలాంగులను ఏడిపిస్తున్నారన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉండినప్పుడు నిమ్మగడ్డ రమేష్ హైదరాబాదు లో లాబీయింగ్ చేయలేదా అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ గెలువకుండా నిమ్మగడ్డ రమేష్ ప్రయత్నించాడన్నారు. లోకేష్ కు జడ్ కేటగిరి ఆవసరమా అని ప్రశ్నించారు. తన నియోజకవర్గం పేరే సరిగ్గా పలకని వ్యక్తి లోకేష్ ప్రజలకు ఏమి చేస్తాడన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా, బల్లెం కిషోర్,పదిలం రాజశేఖర్ 61వ డివిజన్ సీనియర్ నాయకులు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు డివిజన్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
62వ డివిజన్ లో ఓట్లు అభ్యర్థించిన వెలంపల్లి : ఎన్టీఆర్ జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు వైస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైస్సార్సీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు సోమవారం నాడు నియోజకవర్గంలో స్థానిక 62వ డివిజన్ పాయకపురం ఏ వి ఎస్ రెడ్డి రోడ్ తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ అలంపూరు విజయలక్ష్మి, విజయ్ తో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్దిని వివరిస్తూ కరపత్రం అందచేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా, నందేపు జగదీష్ 62వ డివిజన్ సీనియర్ నాయకులు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు డివిజన్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ఇఫ్తార్ విందులో పాల్గొన్న వెలంపల్లి : సెంట్రల్ నియోజక వర్గం 61 వ డివిజన్ స్థానిక శాంతి నగర్ మహమ్మదీయ మజీద్ లో సోమవారం నాడు జరగిన ఇఫ్తార్ విందులో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని ప్రత్యేక నమాజ్ చేసిన ఆనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని ఉపవాసం చేసిన మైనారిటీ సోదరులకు పళ్ళు తినిపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా, బల్లెం కిషోర్,యక్కల మల్లి మస్జీద్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.