వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్
వై నాట్ 175 లక్ష్యంగా కృషి చేయండి
పార్టీ కోసం కష్టపడే వారికి నేదురుమల్లి కుటుంబం అండగా ఉంటుంది
ఏప్రిల్ 4న సీఎం వైఎస్ జగన్ నాయుడుపేట సభను జయప్రదం చేద్దాం
వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పిలుపు
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి పార్టీపై ప్రజాభిమానం మరింత పెంచేలా అనుబంధ సంఘాల నాయకులు కృషి చేయాలని వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి తిరుపతి జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం నేదురుమల్లి నివాసంలోని ఎన్ జే ఆర్ భవన్ లో పార్టీ బలోపేతం పై వైయస్సార్సీపి అనుబంధ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. అనుబంధ సంఘాలు గ్రామ స్థాయి నుండే పార్టీ బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్సీపీ యువత, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిoదని ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలనుప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. టిడిపి బూటకపు హామీలను వివరిస్తూ గతంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన వైనాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు.
పార్టీ కోసం కష్టపడే వారికి నేదురుమల్లి కుటుంబం అండ…
నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి విజయానికి కష్టపడి పని చేసే నాయకులు కార్యకర్తలకు ఎప్పటికీ నేదురు మల్లి కుటుంబం అండగా నిలుస్తుందని నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి నాయకులకు అనుబంధ విభాగాల నేతలకు భరోసా ఇచ్చారు. దీంతో వారిలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి . ఇంకా నేదురుమల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో పింఛన్లు అందుకునే అవ్వ తాతలపై టిడిపి పగబట్టి నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎన్నికల సంఘం కు ఫిర్యాదు చేయించి వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే పింఛన్ అందించే కార్