రాచకొండ పోలీసు కమిషనరేట్ లో పనిచేసి ఈ రోజు సాధారణ పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారులు రవి కుమార్, అడిషనల్ డిసిపి ట్రాఫిక్ 1, శ్రీ కె.మోహన్ రెడ్డి, SI, CCRB, శ్రీ యం. శ్రీరామ్ రెడ్డి, ఊమెన్ పోలీస్ స్టేషన్, ఉప్పల్, శ్రీ డి. యాదయ్య, ARSI, అంబర్ పేట, మరియు స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన శ్రీ జి. రుపెందర్ రెడ్డి, ASI నాచారం, శ్రీ డి. లక్ష్మా రెడ్డి, హెడ్ కానిస్టేబుల్, అంబర్ పేట లను రాచకొండ సిపి కార్యాలయంలో రాచకొండ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి, ఐపిఎస్., గారు సన్మానించారు.
ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ… ఉద్యోగ నిర్వహణలో సుధీర్ఘ కాలంగా అంకిత భావంతో పనిచేసి పదవీ విరమణ చేస్తున్న అధికారులకు అభినందనలు తెలియజేశారు. ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని సూచించారు. సమాజసేవలో పాలు పంచుకోవాలన్నారు. రిటైర్ మెంట్ డబ్బును భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని డబ్బులను ఆచితూచి ఖర్చు చేయాలన్నారు. ఈ సందర్భంగా కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బెనిఫిట్ ఫండ్ క్రింద 30,000/- రూ మరియు సొసైటీ పొదుపు మొత్తాన్ని చెక్కులను సీపీగారు వారికి అందచేశారు.
ఈ కార్యక్రమంలో సీపీ గారితో పాటు CAO accounts శ్రీమతి సుగుణ, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు సి.హెచ్ భద్రా రెడ్డి, ప్రసాద్ బాబు, రంగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.