కలువాయి ఎక్స్ ప్రెస్ న్యూస్.
మండలం కుల్లూరు లో శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి వార్ల కు ఏకాంత సేవా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా ఏకాంత సేవా పూజా కార్యక్రమానికి ఉభయ కర్తలు గా మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం దంపతులు వ్యవహరించారు. స్వామి, అమ్మవార్ల కు పూజలు చేశారు. ఉయ్యాల ఊపుతూ భక్తి పార్వశం లో భక్తులు మునిగి పోయారు.ఆత్మ ప్రదక్షిణ చేశారు.ఉదయం స్వామి, అమ్మవార్ల కు చక్ర స్థానం ఘనంగా నిర్వహించారు.
అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సింగిల్ ట్రష్టి ప్రభాకర్ దంపతులు, భక్తులు గ్రామస్తులుఅధిక సంఖ్యలో పాల్గొన్నారు.