డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ :గురువారం డక్కిలి మండల కేంద్రంలో సిఆర్పిఎఫ్ బలగాలతో కవాతు నిర్వహించరు. ఈ సందర్భంగా వెంకటగిరి వలయ అధికారి సంగమేశ్వరరావు మాట్లాడుతూ జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు తమ ఓటును తమకు నచ్చిన పార్టీ అభ్యర్థులకు స్వేచ్ఛగా నిర్భయంగా వినియోగించుకోవాలని మాట్లాడారు, ఎవరైనా ఎన్నికల కోడ్ నిబంధనలను ముల్లంగించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మండలంలో సమస్యత్మక గ్రామాలుగా ఆల్తురుపాడు, పాతనాలపాడు, దగవోలు గ్రామాలు ఉన్నాయి. ఎన్నికలలో ఎలాంటి అవాంఛియ ఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు సిఆర్పిఎఫ్ బలగాలతో రెండించుల భద్రతను ఏర్పాటు చేస్తామన్నారు.రాజకీయ పార్టీలు, వ్యక్తులు ఎవరైనా ఓటర్లను ప్రలోభపెట్టిన భయపెట్టిన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో డక్కిలి సబ్ ఇన్స్పెక్టర్ చౌడయ్య, సిఆర్పిఎఫ్ బలగాలు పాల్గొన్నారు.