విద్యార్థులతో కలిసి భోజనం చేసిన తాహిశిల్దార్
డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ :తాహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ ఆల్తురుపాడు, తీర్థంపాడు, అమ్ముడూరు పోలింగ్ కేంద్రాలను మంగళవారం పరిశీలించారు. అక్కడ ఓటర్లకు, సిబ్బందికి సౌకర్యాలను ఏర్పాట్లపై స్థానిక గ్రామ రెవెన్యూ అధికారులు పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడ కూడా ఎలాంటి లోపాలు ఉండకుండా జాగ్రత్తగా ఉండాలని వారిని ఆదేశించారు. మధ్యాహ్నం తీర్థంపాడు ఉన్నత పాఠశాల విద్యార్థులుతో కలిసి తాహిసిల్దార్ భోజనం చేశారు. అనంతరం విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులతో ముచ్చటించారు. ఆయన వెంట ఆర్ఐ రాజేష్, వీఆర్వోలు కోటిరెడ్డి,గురుమూర్తి ఉన్నారు.