– తమ నాయకత్వ విలువ తెలిసిరావాలంటే ఇదొక్కటే సరైన మార్గంగా
తెలుగుదేశం వైసీపీలోని అసమ్మతివాదుల ఆలోచన
( వెంకటగిరి` వెంకటగిరి పక్స్‌ప్రెస్)
ఈసారి ఎన్నికలు వెంకటగిరి నియోజకవర్గంలో చాలా తమాషాగా జరగనున్నాయి. క్షణం పాటు అభ్యర్థులు ఏమరుపాటులో వున్నా దెబ్బపడే ప్రమాదం వుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. అభ్యర్థులు నచ్చకపోయినా, పెద్దగా పొట్లాలు అందవన్న అపనమ్మకం కుదిరినా గానీ పక్కపార్టీలోకి జంప్ అవడం జరుగుతూ వుంటుంది. ఇది సాధారణంగా జరిగేది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా పార్టీలోనే వుండి పార్టీ అభ్యర్థిని దెబ్బెయ్యడం అనేది కొత్త ట్రెండ్. ఇరు పార్టీల్లో వుండే కొందరు నాయకులు తమ అభ్యర్థులు నచ్చకపోతే పార్టీలోనే వుండటం, ఓడిరచడానికి శతవిధాలా పోరాడటం. ఇక్కడ పోరాడటం అంటే సైలెంట్‌గా వుండిపోవడం. దీనివల్ల ఎందుకు తమకు పనిచెయ్యడం లేదని అభ్యర్థులు అడిగేపని వుండదు. చెయ్యాలన్న బాధ్యత అసమ్మతి నాయకులకు ఉండదు. తమకు బాగా పట్టున్న గ్రామాన్నో, వీధినో గాలికి వదిలేయడం లోపాయికారిగా రాత్రిపూట ఫోన్లు చేసి ఫలానా అభ్యర్థికి ఓటెయ్యమని చెప్పడం . ఇదే ఎత్తుగడతో నయా పాలిటిక్స్ సిద్ధమవుతున్నాయి. అయితే అసమ్మతివాదుల ఆలోచన ఒక్కటే. నిశ్శబ్ధం వల్లనో, దెబ్బెయ్యడం వల్లనో ఓడిపోతారనో, అప్పుడు తప్పకుండా తమ విలువ ఏపాటితో అభ్యర్థికి తెలిసి వస్తుందన్నది వారి ఆలోచనగా రాజకీయ పండితులు చెబుతున్నారు. దీనివల్ల ఒరిగేదేమీ వుండదని, సైలెంట్‌గా ఉన్నపుడే అసమ్మతి నాయకుల నుంచి అభ్యర్థి తెలివితో చుట్టూ ఉన్న బలగాన్ని తెచ్చేసుకుని వారిని నిర్వీర్యం చెయ్యడమే దానికి కౌంటర్ అని, ఇదే జరుగుతుంటుందని అల్టిమేట్‌గా నష్టపోయేది తామే తప్ప అభ్యర్థికాదన్న సత్యం గ్రహిస్తే బోధపడుతుందంటున్నారు.