– ఇండిపెండెంట్‌గా పోటీచేసే యోచనలో ఉన్నట్లుగా వెల్లడి
– స్వాగతించిన బంధువులు
( రాపూరు` వెంకటగిరి పక్స్‌ప్రెస్)
వైసిపి నాయకుడు మెట్టుకూరు ధనంజయరెడ్డి సోమవారంనాడు కలువాయి, డక్కిలి, బాలాయపల్లి, సైదాపురంలోని కొందరు తెలుగుదేశం, వైసిపిల నాయకులు, ఆయన బంధువులకు ఫోన్‌చేసి తాను ఇండిపెండెంట్‌గా పోటీచేసే యోచనలో ఉన్నట్లుగా వెల్లడిరచినట్లు సమాచారం. కలువాయిలో తెలుగుదేశం పార్టీ నాయకుడు అల్లంపాటి వేణుగోపాల్‌రెడ్డి, డక్కిలి మండలం చీకిరేనిపల్లిలోని మెట్టుకూరు మునిభాస్కర్రెడ్డి, వెలికంటి రమణారెడ్డి ఇంకా కొన్ని మండలాల నాయకులతో మాట్లాడినట్లు విశ్వనీయంగా తెలిసింది.