బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
గీతాంజలి మరణానికి కారకులైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి కాటూరు.రామ తులసి రెడ్డి పేర్కొన్నారు.గురువారం మండల కేంద్రంలో గీతాంజలి మరణానికి కారణమైన వారిని శిక్షించాలని కొవ్వొత్తుల తో నిరసన చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలను అసభ్య పదజాలంతో వేధిస్తున్న టిడిపి జనసేనకు చెందిన మానవ మృగాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలను కించ పరచడం చూస్తుంటే మనసు చలించి పోతుందని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని శిక్షలు అమలు చేస్తున్నప్పటికీ వీరిలో మార్పు రావ డంలేదని మండిపడ్డారు. సోషల్ మీడియాలో వేధింపులకు గీతాంజలి ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి. ఇక సోషల్ మీడియాలో వికృత చేష్టలను అరికట్టాలని
కోరారు. ఈకార్యక్రమంలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.
పోటో:-కొవ్వొత్తులతో నిరసన