వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్
వెంకటగిరి మున్సిపాలిటీలో 14 సచివాలయల లో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వెంకటగిరి మున్సిపాలిటీలో ప్రతి గడప తిరిగిన ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు,వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త గౌరవ శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి సచివాలయానికి మన ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 50 లక్షలు రూపాయలు అభివృద్ధి పనులు కొరకు ఇచ్చినారు. ఆ సమయంలో 25 వార్డులో సిసి రోడ్లు, డ్రైనేజ్ కాలువ లు,అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఆ పనులన్నీ పూర్తయిన సందర్భంగా ఈరోజు 14 సచివాలయలలో ప్రారంభోత్సవ కార్యక్రమమును ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని.. అభివృద్ధి శిలాఫలకాలను ప్రారంభోత్సవం చేసినారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు