హర్షం వ్యక్తం చేసిన రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు
విజయవాడ : ప్రతి సంవత్సరం జూన్ 20వ తేదీని రెవెన్యూ డే గా ప్రభుత్వం ప్రకటిస్తూ సోమవారం గజిట్ విడుదల చేయడం పట్ల ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కె రమేష్ కుమార్ వారి రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. 20.06.1786 వ తేదీన ఏర్పడిన రెవిన్యూ శాఖ దాదాపు 237 సంవత్సరాలుగా నిరంతరం ప్రజలు, రైతులు, భుయజమానుల యొక్క సేవలో ఉంటూ , రెవిన్యూ శాఖలో పనిచేసే గ్రామా రెవిన్యూ సహాయకుడి స్థాయి మొదలు, జిల్లా కలెక్టరు స్థాయి వరకూ 24 గంటలూ ప్రజా సేవలోనే ఉంటూ కుటుంబానికి సైతం సరైన సమయం ఇవాలేని స్థితిలో బోర్డర్ లోని సైనికుడి వలే శ్రమిస్తుంటారు. మనిషి పుట్టిన దగ్గర నుండి మరణించే వరకూ తన యొక్క దైనందిన జీవితంలో రెవిన్యూ శాఖతోనే అనుసంధానం అయి ఉంటారు. భూ సంబందిత భాధ్యతలు, విద్యార్ధులకు , ప్రభుత్వ స్కీములలో లబ్దిదారులకు ధృవీకరణ పత్రాల జారీ భాద్యత, మేజిస్టిరియల్ భాధ్యతలు, ప్రకృతి వైపరిత్యాలలో పౌరులకు సరైన రక్షణ మరియు వసతి కల్పించె భాధ్యతలు, ప్రజాస్వామ్య బద్దముగా ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి వోటరు నమోదు మొదలుకుని అన్ని ఏర్పాట్లు చేసే భాద్యత, ప్రజా పంపిణి వ్యవస్థ సజావుగా నిర్వహించేలా చూసే భద్జ్యత, వి.ఐ.పి./ వి.వి.ఐ.పి ప్రోటోకాల్ భాధ్యతలు ఇలా అనేక రకాలైన భాధ్యతలను ఎంతో సమర్దవంతముగా నిర్వహించుచున్న రెవిన్యూ శాఖ గూర్చి ప్రజలలో అవగాహన కల్పించడం కోసం, శాఖను ప్రజలకు మరింత చేరువ చెయ్యడం కోసం, రెవిన్యూ శాఖలో విస్త్రుత స్థాయిలో సేవలందించి రెవిన్యూ ఉద్యోగులకు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులను సత్కరించుకోవడం కోసం ప్రతీ సంవత్సరం జూన్ 20న రెవిన్యూ డే గా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం జూన్ 20 వ తేదీని ఆంధ్ర ప్రదేశ్ లో రెవిన్యూ దినోత్సవముగా పాటించాలని ప్రభుత్వం గజిట్ విడుదల చేయడం శుభ పరిణామం అని బొప్పరాజు తెలిపారు. జి.వో.ఎంఎస్.నెం.81 రెవిన్యూ (సర్వీసెస్ .II) శాఖ, తేదీ 4.3.2024 ద్వారా ఈ రోజు ఉత్తర్వులు జారీ చేయడం పట్ల రాష్ట్రంలోని ప్రతీ రెవెన్యూ ఉద్యోగి హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతీ సంవత్సరం జూన్ నెల 20 న ఆంధ్ర ప్రదేశ్ లో రెవిన్యూ దినోత్సవం ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ మండల, జిల్లా స్థాయిలలో నిర్వహించాలని ప్రభుత్వ ఉత్తర్వులలో పేర్కొన్నారు. రెవిన్యూ శాఖ అందించే సేవలపై అవగాహన పెరగడం కోసం, భూ వ్యవహారాలు, వివిధ ప్రయోజనాల కొరకు జారీ చేయబడుచున్న ధృవీకరణ పత్రాలు, రెవిన్యూ శాఖ ద్వారా వసూలు చేయబడుతున్న నీటి పన్ను, దానిని స్థానిక సంస్థల అభివృద్ధి కోసం వెచ్చిస్తున్న విధానాలను ప్రజలు, రైతులకు ఆ రోజున అవగాహన కల్పించాలి. రెవిన్యూ రికార్డులు, అడంగలు, 1బి, ప్రభుత్వ భూములు , దేవాదాయ శాఖ భూములు, వక్ఫ్ భూముల వివరాలు ప్రదర్శించి , భూముల సంబందిత విశాయాల పై ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రభుత్వాన్ని రెవెన్యూ అసోసియేషన్ కోరింది. రెవెన్యూ శాఖ నుండి ఏదైనా అదనపు సేవలను పొందేందుకు ప్రజా ప్రతినిధుల/ప్రజల నుండి కొన్ని సూచనలను స్వీకరించడం పదవీ విరమణ చేసిన రెవెన్యూ ఉద్యోగులకు వారి పదవీ కాలంలో వారు అందించిన అద్భుతమైన సేవలకు సన్మానం,సెలక్షన్ కమిటీ ద్వారా తమ విధులు/సేవల్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు కమెండేషన్ సర్టిఫికేట్ జారీ చేయడం,ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ లో తీర్మానం మేరకు, మా విజ్ఞప్తి మేరకు 1786లో రెవిన్యూ శాఖ ఏర్పడిన తేదీ ఐన జూన్ 20 వ తేదీను రెవిన్యూ డే గా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ పక్షాన అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి ప్రధానంగా ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.యస్.జవహర్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి , చీఫ్ కమిషనర్ ఆఫ్ లాండ్ అడ్మినిస్ట్రేషన్ జి.సాయిప్రసాద్ , ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ అజయ్ జైన్ , జీ ఏ.డి, లా, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.