హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం జీవో3 తో ఆడబిడ్డల నోట్లో మట్టి కొడుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఆ జీవోతో మహిళలు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయన్నారు. గురుకుల పోస్టుల్లో కేవలం 77 మాత్రమే వచ్చాయని, 6వేల ఉద్యోగాల్లో మహిళలకు ఇచ్చింది కేవలం 70 మాత్రమే అని అన్నారు. మహిళలకు అన్యాయం చేసే జీవో3 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవో 3కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈనెల 8న మహిళ దినోత్సవం రోజు ధర్నా చౌక్‌లో నల్ల రిబ్బన్లు ధరించి ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. రోస్టర్ విధానంతో ఎక్కువ మంది మహిళలకు ఉద్యోగాలు రాకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. మోడీ పెద్దన్న అని రేవంత్ రెడ్డి సంబోదించారని, దీంతో బీజేపీ – కాంగ్రెస్ ఒక్కటే అని అర్థమవుతోందన్నారు. ఒక్క రూపాయి కేంద్ర బడ్జెట్లో ఇవ్వని మోడీ ఎలా పెద్దన్న అవుతాడో చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.