ఘనంగా టీఎంకేజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ ఆత్మీయ సత్కారం
టీఎంకేజేఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చింతగట్టు విఠల్
ఐక్య ఉద్యమాలతోనే కాపులు రాజ్యాధికారాన్ని సాధించుకోవచ్చని దీనికోసం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని బీజేవి రాష్ట్ర అధికార ప్రతినిధి చింతగట్టు విఠల్ అన్నారు. కరీంనగర్ లోన శుభమంగల్ కన్వెన్షన్ హాల్ లో ఆదివారం తెలంగాణ మున్నూరుకావు. జర్నలిస్ట్ ఫోరం రాష్ట్రకార్యవర్గ ఆత్మీయ సత్కార కార్యక్రమానికి ఫోరం జిల్లా అధ్యక్షులు వేల్పుల శ్రీనివాస్ వటేల్ అధ్యక్షత వహించారు. ఈ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చింతకుంట విఠల్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మున్నూరుకావులు పాత్ర కీలకమైందన్నారు. నీరు, నిధులు, నియమాకాలు వస్తాయన్న ఆశతో ఉద్యమాన్ని ప్రాణాలు పణంగా పెట్టి పోరాడితే సాధించుకున్న రాష్ట్రన్ని అదోగతి చేసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కావులు మౌనంగా ఉన్నంత వరకు ఎలాంటి రాజ్యాధికారిన్ని సాధించుకునే పరిస్థితి ఉ ండదన్నారు. పాలక వర్గాలు కావుల దగ్గరకు వచ్చి ప్రాధయవడాల్సిన పరిస్థితి కల్పించలన్నారు. ఎక్కువ జనభా ఉన్న బీసీలు ఎన్నో సార్లు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉన్న అగ్రవర్ణలా పెద్దరికం వల్ల చేజారిపోయిందన్నారు. -ముఖ్యమంత్రి స్థాయి వదువులను కూడా వదులుకున్న సందర్భలు ఉన్నాయన్నారు. మున్నూరుకావులు ఇదే తరహాలో ఐక్యంగా ఉంటే రానున్న మూడేళ్లలో ఐలమైన శక్తిగా మారే అవకాశం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు బాల శ్రీనివాస్ మాట్లాడుతూ సామాజిక చైతన్యాన్ని తీసుకచ్చినప్పుడే కావులు ఐలవడుతారని, కావులను మరో ఉద్యమానికి ఉసి గొల్పేందుకు సిద్ధం కావాలన్నారు. ఐక్యంగా ఉ నప్పడే మన ఐలం’ బలగం పెరుగుతుందని మనలో మనల్ని విచ్చినం చేసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉ ండాలని సూచించారు. రాబోయే రోజుల్లో కావులు రాజకీయంగా ఆర్ధికంగా, సామాజికంగా ఎదిగి రాజ్యాధికార దిశ గా పయనించేందుకు సిద్ధం కావాలన్నారు. మున్నూరు కావుసంఘం రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు బండి పద్మ మాట్లాడుతూ ప్రతి ఎన్నికల్లో కావులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారే తప్ప వారి భవిష్యత్ పట్ల ఏ నాయకులు శ్రద్ద చూపడం లేదన్నారు. కావులను నిందించినప్పుడు ఎదిరించే సత్తాను పెంచుకోకపోతే భవిష్యత్‌లో అనేక ఇబ్బందులు ఎదుర్కొక తప్పదన్నారు. మహిళలతో పాటు మున్నూరుకావుల్లో అన్ని విభాగాలతో కలిసి జేఏసీ గా ఏర్పడి ఉద్యమానికి రూపకల్పన చేయలన్నారు. కావుల ఐక్యత కోసం ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా కృషి చేసినప్పుడే ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ మున్నూరు కావు జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఏ మాత్రం శ్రమించని వ్యక్తులే అధికారం సాధించి తమ పబ్బం గడువుకుంటున్నారని ఆరోపించారు. జనబాలో సింగిల్ డిజిట్ దాటని వర్గాలే మొదటి నుంచి బీసీలను అనగదొక్కుతు రాష్ట్రన్ని పాలిస్తున్నాయన్నారు.మున్నూరు కాపు లకు ఎవరికి కష్టం వచ్చిన జర్నలిస్ట్ ఫోరం అండగా ఉంటుందని తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గంలో చోటు లభించిన మున్నూరు కాపు సంఘ నాయకులను మనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఫోరం క్యాలెండర్ ను ఆవిష్కరించడంతో పాటు పటేల్ యూత్ ఫోర్స్ లోగోను విడుదల చేశారు. అనంతరం ముఖ్య అతిధులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు సాయినరేందర్, రాజ్‌కుమార్, మాజీ బారసోసియేషన్ అధ్యక్షులు ఎర్రం రాజీరెడ్డి కవి వసుల రవి కుమార్, మాజీ తహసిల్దార్ కొట్టె వెంకటనారాయణ, ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు మామిండ్ల రమేశ్పటేల్, ప్రముఖ ఇంజనీర్ కోలా అన్నారెడ్డి, ఆకుల ప్రభాకర్, ఉప్పు తిరుపతి, పత్యం వసంత, సుదీర్, ఉద్యోగల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ , రంగారెడ్డి జిల్లా కన్వీనర్ గంట విజయ్ కుమార్ ,సీనియర్ రిపోర్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.