బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
జిల్లా వ్యాప్తంగా ఉన్న 5.256 మంది చిన్నా రులం దరికీ (0 నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు) పోలియో చుక్కలు వేయించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి ప్రమీల,ఆయర్వేద వైద్యాధికారి శాస్త్రి లు పేర్కొన్నారు.శనివారం బాలాయపల్లిలో పల్స్ పోలియోపై అవగాహన ర్యాలీని నిర్వహిం చారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఈనెల 3న ఆది వారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలియో బూత్ లలో పోలియో చుక్కలు వేయ నున్నట్లు చెప్పారు. మండలంలో సుమారు 5.256 మంది చిన్నారు లకు పోలియో చుక్కలు వేసేందు కు అని ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. గత 14 ఏళ్లుగా దేశంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని,ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈసారి కూడా ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాల న్నారు. ఇటీవల పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో ఆరు పోలియో కేసులు నమోదయ్యాయని, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి తమ చిన్నారులకు పోలియో చుక్కలను వేయించడం తమ బాధ్యతగా గుర్తించాలన్నారు.ఏ కారణం చేతనైనా పోలియో చుక్కలు వేసుకోని చిన్నారు లకు ఈనెల 4,5,6 తేదీల్లో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికి వచ్చి పోలియో చుక్కలు వేయన్నునట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలం దరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదిత రులు పాల్గొన్నారు.
పోటో:-ర్యాలీ చేస్తున్న దృశ్యం