హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన కుటుంబ సభ్యులతో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్)ను కలిసి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులు హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి శనివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో ఆయన్ను కలిసి పుష్పగుచ్ఛమిచ్చి, శాలువాతో సత్కరించారు. వారికి నూతన వస్త్రాలతో పాటు తాజా పండ్లతో కూడిన బుట్టను బహుకరించి తనను రాజ్యసభకు తిరిగి పంపించడం (నామినేట్)పట్ల హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఎంపీ వద్దిరాజు-విజయలక్మీ లతో పాటు వారి కూతురు-అల్లుడు డాక్టర్ గంగుల గంగాభవాని-సందీప్, నయుడు వద్దిరాజు నాగరాజు, మనవళ్లు గంగుల సనవ్, గంగుల సౌరవ్ లు కలిసి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.