వెంకటగిరి అసెంబ్లీ ఎక్స్ ప్రెస్ న్యూస్ రాపూరు
ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండల పరిధిలోని పెంచలకోన క్షేత్రంలో స్వయంభుగా వేసి భక్తులచే ఇంటి విలవేల్పుగా పూజింపబడుతున్న శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం, స్వాతి నక్షత్ర వేడుకలు, రాత్రి బంగారు గరుడ సేవ వైభవంగా నిర్వహించారు, స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం శుభ సందర్భంగా, శుక్రవారం ఉదయం తెల్లవారుజామున, 4 గంటలకు, పంచామృతాలతో మూలవిరాట్ కు అభిషేకం నిర్వహించారు, అనంతరం స్వామివారికి చందనాలంకారంతో ప్రత్యేకంగా అలంకరించి పుష్పాలంకరణ నిర్వహించారు , 10 గంటలకు స్వామివారి స్వామివారి నీత్య కల్యాణ మండపం లొ విశేష నృసింహ హోమం నిర్వహించారు, సాయంకాలం ఆస్థాన సేవ నిర్వహించారు, రాత్రి స్వామివారికి ఎంతో ప్రీతికరమైన, బంగారు గరుడవాహనంపై స్వామి వారిని కొలువు తీర్చి, రంగు రంగుల పుష్పాలతో అలంకరించి, వేద పండితుల,మంత్రోచ్ఛారణ నడుమ, మేళ తాళాలతో కోన మాడవీధులలో క్షేత్రోత్సవ నిర్వహించారు, దేవస్థాన అసిస్టెంట్ కమిషనర్ సాగర్ బాబు, కోనకు వచ్చిన భక్తులకు భోజన వసతి ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమంలో దేవస్థాన ప్రధాన అర్చకులు పెంచలయ్య స్వామి,సీతారామయ్య స్వామి,పూజారులు, వర్ధన్ స్వామి, భార్గవ్ స్వామి,శశి స్వామి,వినోద్ స్వామి ,మధు స్వామి, బాలాజీ స్వామి, మోక్ష స్వామి,మల్లికార్జున స్వామి,నాగార్జున స్వామి, సాయి స్వామి,మాధవ స్వామి,దేవస్థాన సిబ్బంది, భక్తులు,తదితరులు పాల్గొన్నారు.