మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురు, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు తెరపైకి అభ్యర్థి పేరు
నేడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసిన మురుగుడు లావణ్య
గుంటూరు : ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావటంతో మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమల, ఆర్కే, మురుగుడు సత్యం, మురుగుడు లావణ్య ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని శుక్రవారం కలిశారు. లావణ్యను ఆప్యాయంగా జగన్ పలకరించారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో చివరి ఘట్టంకు వచ్చినట్టు సమాచారం. రెండు రోజుల్లో ప్రకటన ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అభ్యర్థి విషయంలో ఫైనల్ స్టేజ్ కు వచ్చిన వైసీపీ అధిష్టానం ఇక సస్పెన్స్ కు తెర దించే అవకాశం ఉంది.