హైదరాబాద్ : గురువారం సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘం అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటుతో పాటు, ఈడబ్ల్యుఎస్ సర్టిఫికెట్ జారీకి నిర్దేశించిన ఆదాయ పరిమితిని 8 లక్షల నుంచి 12 లక్షలకు పెంచేలా చర్యలు తీసుకునేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని రెడ్డి సంఘం మంత్రికి వినతి పత్రాన్ని సమర్పించింది. ఈ సందర్భంగా రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోపు జయపాల్ రెడ్డి, ఇతర సభ్యులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.