మచ్చా రామలింగారెడ్డి కృషి అభినందనీయం
సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు
రాష్ట్రస్థాయి క్రికెట్ ట్రోఫీలను ఆవిష్కరించిన కలెక్టర్ అరుణ్ బాబు
అనంతపురం : రాష్ట్రంలో ఉండే జర్నలిస్టులందరూ క్రికెట్ టీములుగా వచ్చి ఇక్కడ టోర్నమెంట్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఇది జర్నలిస్టు ఐక్యతకు నిదర్శనమని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అన్నారు అనంతపురం నగరంలోని ఆర్డిటి క్రీడా గ్రామంలో జరుగుతున్న శ్రీ సత్యసాయి స్టేట్ లెవెల్ జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ యూనిటీ కప్ 2024 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మచ్చా రామలింగారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ తీవ్ర పని ఒత్తిడిలో ఉండే జర్నలిస్టులకు ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు కొద్దిగా పని ఒత్తిడి నుంచి ఉపశనం కలుగుతుందన్నారు అలాగే ఈ టోర్నమెంట్ నిర్వహణ కోసం కృషి చేసిన మచ్చా రామలింగారెడ్డి కృషి అభినందనీయమన్నారు అనంతపురం జిల్లా నుంచి రంజి ట్రోఫీకి ఎంపికైన మచ్చా దత్తారెడ్డి ను అభినందించారు రంజి ట్రోఫీతోనే కాకుండా జాతీయ స్థాయిలో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం వివిధ జిల్లాలకు చెందిన జర్నలిస్టు క్రికెట్ టీంలకు మెడల్స్ మరియు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ట్రోఫీలను అందజేశారు.
మచ్చా దత్త రెడ్డి ను సన్మానించిన కలెక్టర్
అనంతపురం నుంచి రంజీ ట్రోఫీ జట్టుకు ఎంపికైన మచ్చా దత్తారెడ్డిని కలెక్టర్ అభినందిస్తూ ఆర్డిటి స్టేడియంలో సన్మానించారు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన అభిలాషించారు కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. క్రికెట్ ఆడిన సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, క్రికెటర్ కూడా కావడం విశేషం కార్యక్రమంలో భాగంగా రంజీ ట్రోఫీ క్రీడాకారుడు దత్తారెడ్డి బౌలింగ్, కలెక్టర్ అరుణ్ బాబు బ్యాటింగ్ చేశారు అనంతరం ఏపీడబ్ల్యూజేయు ఆధ్వర్యంలో కలెక్టర్ కు చిరుసన్మానం నిర్వహించారు. క్రికెట్ అభివృద్ధి కోసం మచ్చా రామలింగారెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అన్నారు. సత్య సాయి జిల్లా నుంచి తాను కూడా ఒక టీంను సిద్ధం చేసుకుని మ్యాచ్ ఆడదామని కలెక్టర్ మచ్చ రామలింగారెడ్డి తో అన్నారు.