హైదరాబాద్ : ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం పట్ల హర్షాతిరేకలు వ్యక్తం చేస్తూ మునుగోడు నియోజకవర్గానికి చెందిన మున్నూరుకాపులు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర నివాసానికి తరలివచ్చారు. ఆయనను పుష్పగుచ్ఛాలు, శాలువలతో ముంచెత్తారు, శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని రవిచంద్ర నివాసం సోమవారం మునుగోడు నుంచి వచ్చిన మున్నూరుకాపులతో కోలాహలంగా కనిపించింది. మునుగోడు ఎన్నిక సందర్భంగా ఎంపీ రవిచంద్ర ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, సర్థార్ పుట్టం పురుషోత్తంల నాయకత్వాన మున్నూరుకాపులు టీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం విశేష కృషి చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ కేతనం ఎగురేయడంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎంపీ రవిచంద్ర నివాసానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకు మిఠాయి తినిపించి, శాలువలతో సత్కారాలు చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా రవిచంద్ర స్వీట్స్ పంచి పెట్టి అందరిని పేరుపేరునా అభినందించారు, ఐకమత్యం ఇదేవిధంగా కొనసాగిద్దామన్నారు.ఎంపీ వద్దిరాజును కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో మున్నూరుకాపు ప్రముఖులు సర్థార్ పుట్టం పురుషోత్తం, ఆకుల రజిత్,బండి సంజీవ్, విష్ణు జగతి,వాసుదేవుల వెంకటనర్సయ్య, రామస్వామి వెంకటేశ్వర్లు, జెన్నాయికోడే జగన్మోహన్,పుస్తే శ్రీకాంత్,కోట్ల వినోద్,బాశెట్టి నర్సింహారావు, పాదం అనిల్ కుమార్,కంచర్ల భిక్షమయ్య,కసిరెడ్డి శ్రీనివాస్, మెరుగు మురళి, న్యాయవాదులు గుండ్లపల్లి శేషగిరిరావు,సకినాల రవికుమార్, యువ నాయకులు యాద క్రాంతి, అనిల్ పటేల్, నిరంజన్ తదితరులు ఉన్నారు.మునుగోడు ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈ రోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.