అమరావతి : సచివాలయ ఉద్యోగులు, ఎపీఎన్జీవో ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ పరిపాలన శాఖ లేఖ రాసింది. ప్రభుత్వం కల్పించిన ఉచిత వసతిలో విద్యుత్ బకాయిలు చెల్లించాలని లేఖలో పేర్కొంది. పరిమితికి మించి విద్యుత్ వాడుకున్నారని, రూ.3లక్షల మేర విద్యుత్ ఛార్జీలు చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సచివాలయ ఉద్యోగులకు, ఏపీ ఎన్జీవో సంఘాల అధ్యక్షులకు లేఖలు పంపించింది.