హైదరాబాద్ : బీజేపీ , భారాస సిద్ధాంతాలు లేని పార్టీలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. ఆ రెండు పార్టీలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్లో ఆయన మాట్లాడారు. సెక్యులర్ మాటకు కట్టుబడి ఉన్నది రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. కిషన్రెడ్డి, బండి సంజయ్ మాటలకు బీజేపీలో విలువ లేదు. భారాస, బీజేపీ లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. కొత్త నాటకానికి తెరలేపారు. కవితను అరెస్టు చేస్తే సానూభూతి వచ్చి ఓట్లు డైవర్ట్ అవుతాయని వాళ్ల లెక్క. కాంగ్రెస్ ఓట్లు చీల్చాలనేది వారి ఆలోచన అని ఆరోపించారు.