వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ : రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ప్రజా సభగా రాప్తాడు సిద్దం సభ నిలిచిందని రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటనను విడుదల చేశారు. సీఎం జగన్ బయటకు వస్తే జన ప్రభంజనమేనని ప్రజకు మరోసారి చాటి చెప్పారని అన్నారు. ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడు లో నిర్వహించిన సిద్ధం సభకు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ గారికి లక్షలాది మంది జనం బ్రహ్మరథం పట్టి సభను విజయవంతం చేశారని చెప్పారు.250 ఎకరాల ప్రాంగణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనసందోహం ఈ సభకు వచ్చారని తెలిపారు.
విజయసాయిరెడ్డికి రాష్ట్రపతి అభినందనలు : సంసద్ మహా రత్న అవార్డును పొందిన రాజ్యసభ సభ్యులు,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపిన ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పార్లమెంటులో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన పార్లమెంటరీ స్థాయీ సంఘం చైర్మన్ గా ఆయనకు సంసద్ మహా రత్న అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఈ సంసద్ రత్న అవార్డులను పొందిన పార్లమెంటు సభ్యులకు రాష్ట్రపతి అభినందనలు తెలియజేశారు.