ఆలిండియా క్రిస్టియన్ ఫెలోషిప్ ఫౌండర్ రాష్ట్ర అధ్యక్షుడు డేనియల్
విజయవాడ : క్రైస్తవ హక్కుల కోసం పోరాడతామని ఆలిండియా క్రిస్టియన్ ఫెలోషిప్ ఫౌండర్ రాష్ట్ర అధ్యక్షుడు డేనియల్ పోలిమెట్ల అన్నారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ హక్కులపై పోరాడుతున్న క్రైస్తవ నాయకులు, కార్యకర్తలు, పాస్టర్లు , దైవ సేవకులకు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాలు గ్రామాలలో ఏ.ఐ.సి.ఎఫ్ సేవలు కొనసాగిస్తుందన్నారు. అందులో భాగంగా ప్రత్యేకంగా క్రైస్తవ నాయకులు, క్రైస్తవ సంఘాలకు, క్రైస్తవ సేవకులు వారి సమస్యలను మీ మీ గ్రామాలలో ఏ.ఐ.సి.ఎఫ్ సేవాదళ్ నాయకుల ద్వారా మీ వద్దకు వచ్చి మీ సమస్యకు పరిష్కార దిశగా పోరాట, కార్యక్రమాలు సహాయ సహకారాలు, అందించటానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని గ్రామాల్లో వున్న మా ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెలోషిప్ నాయకులు పాల్గొంటారని చెప్పారు. పూర్తి కార్యాచరణతో ఈ కార్యక్రమాన్ని క్రిస్టియన్ సోదరీ సోదరీమణులు దైవజనులు సేవకులు వారి వారి యొక్క అభ్యున్నతికి మా ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెలోషిప్ ముందుండి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, అందరూ సహకరించాలని కోరారు.