ఐహెచ్అర్ఏ ఆంధ్రప్రదేశ్ సివిల్ రైట్స్ చర్మెన్ కరణం తిరుపతి నాయుడు
అమరావతి : ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని ఐహెచ్అర్ఏ ఆంధ్రప్రదేశ్ సిసిల్ రైట్స్ చర్మెన్ కరణం తిరుపతి నాయుడు పేర్కొన్నారు. ఎలక్టోరల్ బాండ్ల పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు.బ్లాక్ మనీ సమస్యను పరిష్కరించేందుకు పోల్ బాండ్స్ స్కీమ్ ఒక్కటే పరిష్కారం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 19(ఏ)(ఏ) ప్రకారం సమాచార హక్కును ఉల్లంఘినాకు పాల్పడటమే అన్నారు. ఆర్పీఏ, ఐటీ చట్టంలో 29(1)సెక్షన్ సవరణ రాజ్యాంగ వ్యతిరేకం అవుతుందని ఆయన అబిప్రాయా పడ్డారు. రాజకీయ నిధుల గురించి సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉందన్నారు. ఎలక్టోరల్ బాండ్లను జారీ చేసే బ్యాంకులు తక్షణమే బాండ్లను నిలిపివేయాలని కోర్టు తీర్పు హర్షణీయమని పేర్కొన్నారు. నిధులు అందుకున్న రాజకీయ పార్టీలు వివరాలను ఎస్బీఐ బ్యాంకు వెల్లడించాలని కోర్టు కోరిందని, కోర్ట్ ఆదేశాలమేరకు మార్చి 6లోగా ఎన్నికల సంఘానికి ఆ వివరాలను ఇవ్వాల్సిదేనని తిరుపతి నాయుడు డిమాండ్ చేశారు. దేశంలో ప్రజా స్వామ్య ప్రభుత్వం కొనసాగటానికి ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం అత్యంత కీలకమన్నారు. ఎన్నికలు కూడా సమున్నత ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తు చేశారు. ఏయే రాజకీయపార్టీ లకు ఎన్ని నిధులు లభిస్తున్నాయన్న సమాచారం ఓట ర్లకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ‘నల్లధనాన్ని అరికట్టటానికి ఎలక్టోరల్ బాండ్లు ఒక్కటే మార్గం కాకూడదన్నారు. సమాచార హక్కుపై ఇవి ఎలక్టోరల్, బాండ్ల కన్నా తక్కువ ప్రభావమే చూపుతాయని అభిప్రాయపడ్డారు. నిర్ణీత 15 రోజుల్లోపు నగదుగా మార్చుకోని బాండ్లను ఆయా పార్టీలు లేదా వాటిని కొన్నవారు బ్యాంకుకు తిరిగి ఇచ్చివేయాలన్న కోర్ట్ ఆదేశాలను పాటించి బ్యాంకు ఆ మొత్తాన్ని కొనుగోలుదారు ఖాతాలో జను చేయాలని తిరుపతి నాయుడు డిమాండ్ చేశారు.