గుంటూరు : రైతులకు మద్దతు ధర అందాలని, ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర తీసివేస్తున్నామని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. సోమవారం వ్యవసాయశాఖపై సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా రైతులనుంచి కూడా 93శాతం ఇ–కేవైసీ పూర్తయ్యిందని అధికారులు వివరించారు. మిగిలిన 7 శాతం రైతులకు ఎస్సెమ్మెస్‌లు ద్వారా ఇ–క్రాప్ వివరాలు పంపించాలని సీఎం కోరారు. గ్రామంలో రైతుల సమక్షంలో సోషల్ఆడిట్ కూడా నిర్వహించామని,ధాన్యం సేకరణపై కూడా ప్రణాళికను అధికారులు వివరించారు. ఎంఎస్పీ కన్నా తక్కువ ధరకు రైతులు అమ్ముకోవాల్సి వచ్చిందనే మాట ఎక్కడా రాకూడదని, దీన్ని అధికారులు సవాల్‌గా తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోరారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర తీసివేస్తున్నామని,
రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందించేలా ధాన్యం సేకరణ కొనసాగాలన్నారు. ఇ–క్రాపింగ్ డేటాను వాడుకుని అత్యంత పటిష్ట విధానంలో ధాన్యం సేకరణ కొనసాగాలన్న సీఎం వ్యవసాయ శాఖతో పౌరసరఫరాల శాఖ అనుసంధానమై రైతులకు మంచి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని, రబీకి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఎరువులు, విత్తనాలు, ఇలా అన్నిరకాలుగా రైతులకు కావాల్సివన్నీ సిద్ధంచేసుకోవాలన్న సీఎం
22.92 లక్షల హెక్టార్లలో పంటలు వేస్తారని అంచనా.
సున్నావడ్డీ పంటరుణాలతో పాటు ఇన్పుట్ సబ్సిడీ కూడా నవంబరు 29న జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పొలంబడి కార్యక్రమాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులకు అప్రెంటిషిప్ చేయించడం, వారి ద్వారా క్షేత్రస్థాయిలో అవగాహన పెంపు, వారి నుంచి సలహాలు పొందడంపై దృష్టిపెట్టాలన్నారు. ప్రతి ఆర్బీకేలో ఒక డ్రోన్‌ను ఉంచేలా కార్యాచరణ సిద్ధంచేయాలని,
వచ్చే రెండేళ్లలో అన్ని ఆర్బీకేల్లోనూ డ్రోన్స్ ఉండేలా చూడాలన్న సీఎం కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల ద్వారా ఇచ్చిన వ్యవసాయ యంత్రసామగ్రి అంతా రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలన్న సీఎం
రైతులందరికీ వీటి సేవలు అందాలని సీఎం సూచించారు.
ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్‌పై సీఎం సమీక్ష.
భూసార పరీక్షలు చేసే పరికరాలను ప్రతి ఆర్బీకేలో ఉంచాలని సీఎం ఆదేశం.
ఈ పరికరాలను అన్ని ఆర్బీకేలకు అందుబాటులో ఉంచాలన్న సీఎం. మార్చిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.
భూసార పరీక్షలు కారణంగా ఏ ఎరువులు వాడాలి? ఎంతమేర వాడాలన్నదానిపై స్పష్టత వస్తుందన్న సీఎం.
దీనివల్ల పెట్టుబడి తగ్గుతుందని, దిగుబడులు కూడా పెరుగుతాయన్న సీఎం.
భూసారాన్నికూడా పరిరక్షించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని సీఎం పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో ఉత్తమ విధానాలు, వివిధ రకాల కార్యక్రమాలు, ఉత్పత్తి, ఉపకరణాలు, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్, అదనపు విలువ, మౌలిక సదుపాయాలు, ఎగుమతులకు సంబంధించి విశేష ప్రతిభ కనపర్చిన వారికి 2022 సంవత్సారానికి గాను ఇండియా అగ్రిబిజినెస్ అవార్డులు అందిస్తున్న ఇండియన్ ఛాంబర్ ఆఫ్ పుడ్ అండ్ అగ్రికల్చర్ (ఐసీఎఫ్ఏ).
విత్తన కేటగిరీలో అవార్డును ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ గెలుచుకుంది. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ,మార్కెటింగ్, సహకార, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్ ఎం వి యస్ నాగిరెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి, మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, సివిల్ సఫ్లైస్ కమిషనర్ హెచ్ అరుణ్‌కుమార్, వ్యవసాయశాఖ కమిషనర్ సీహెచ్ హరికిరణ్, సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ జి వీరపాండ్యన్, ఏపీఎస్‌ఎస్‌డీసీఎల్ వీసీ అండ్ ఎండీ జి శేఖర్‌బాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.