వాలంటీర్లు నా సైన్యం..పేదలకు సేవ చేసే వాలంటీర్లే
నా సైన్యం 2.60 లక్షల మంది వాలంటీర్లే
మన సచివాలయ వ్యవస్థ తులసి మొక్క
వాలంటీర్లు రేపు కాబోయే లీడర్లు
యుద్ధానికి సిద్ధమా అని వాలంటీర్లను ప్రశ్నించిన సీఎం
చంద్రబాబు పాలన విష వృక్షం..మన పాలన కల్పవక్షం
బాబుకు ఓటు వేస్తే ఏం జరుగుతుందో ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్మోహన్రెడ్డి
గుంటూరు : గత టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలతో దోచుకున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. జన్మభూమి కమిటీ, సచివాలయ వ్యవస్థ మధ్య చాలా తేడా ఉందని, పేదలకు సేవ చేయడానికి మన వ్యవస్థలు పుట్టాయన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్ల అభినందన సభలో మాట్లాడుతూ మన వ్యవస్థల ద్వారా ప్రతీ గ్రామంలో స్కూళ్లు, ఆసుపత్రులు మారాయని పేర్కొన్నారు. ‘‘ఇంటింటి ఆర్యోగాన్ని దృష్టిలో పెట్టుకొని సురక్ష ప్రవేశపెట్టాం. గత ప్రభుత్వంలో ప్రతీ పథకానికి లంచం ఇవ్వాలిందే. గత ప్రతీ పనికి కార్యాలయా చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. వాలంటీర్లు సూర్యుడు ఉదయించక ముందే ఇంటి తలుపు తట్టి పెన్షన్ అందిస్తున్నారు. కులం,మతం , ప్రాంతం చూడకుండా అర్హతే ప్రామాణికంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి, చంద్రబాబు పాలనలో 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ వచ్చేది. గడప గడపకు వెళ్లి పెన్షన్ ఇస్తున్న వ్యవస్థ ఎక్కడా లేదని సీఎం చెప్పారు.
వాలంటీర్లు నా సైన్యం : పేదలకు సేవ చేసే వాలంటీర్లే..రేపు కాబోయే లీడర్లు. చంద్రబాబు జన్మభూమి కమిటీలు గంజాయి మొక్క. మన సచివాలయ వ్యవస్థ తులసి మొక్క. గతంలో జన్మభూమి కమిటీల అరాచకాల వల్ల జనం నష్టపోయారు. చంద్రబాబు పాలన విషవృక్షం, మన పాలన కల్పవృక్షం. నా పాలనకు మీరంతా బ్రాండ్ అంబాసిడర్లు వాలంటీర్ల సేవలకు గర్విస్తూ సెల్యూట్ చేస్తున్నా. ఇవాళ్టి నుంచి వారంపాటు వాలంటీర్లకు వందనం కార్యక్రమం. పేదవాళ్లకు మంచి చేయాలన్న తపన చంద్రబాబుకు లేదు. 875 మంది వాలంటీర్లకు సేవావజ్రా అవార్డులు. 4,150 మంది సేవారత్న అవార్డులతో గౌరవం. 2,50,439 మందికి సేవామిత్ర అవార్డులతో సన్మానం. 2,55,464 మంది వాలంటీర్లకు అభివందనలతో నగదు బహుమతి. లంచాలు, వివక్ష వ్యవస్ధను వాలంటీర్ల బద్దలు కొట్టారు. మీ నిజాయితీని గుర్తిస్తూ నాలుగేళ్లుగా బహుమతులు ఇస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు : ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రజల కష్టాలను చూసి మన మేనిఫెస్టో పుట్టిందని, చంద్రబాబు మేనిఫెస్టో హైదరాబాద్లో పుట్టిందన్నారు. వివక్షకు చోటు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు.. చంద్రబాబు వేరే రాష్ట్రాల్లోని హామీలను కిచిడీ చేసి మేనిఫెస్టో అంటాడు. బాబు హామీలకు రూ. లక్షా 26 వేల 140 కోట్లు అవుతుంది. ఎలాగో ఇచ్చేది లేదు కాబట్టి బాబు ఏదేదో చెప్తాడు. ప్రజలను మోసం చేయడానికే చంద్రబాబు సాధ్యం కానీ హామీలు ఇస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. చంద్రబాబు కాలుకదపకుండా హైదరాబాద్ ఇంట్లో కూర్చుంటారు. వేరే రాష్ట్రాల్లో గెలిచిన పార్టీల హామీలు సేకరిస్తారు. ఆ హామీలన్నీ కిచిడీలు చేసి కొత్త మేనిఫెస్టో అంటారు. ఆ హామీలు అమలు చేసే పరిస్ధితి కూడా రాష్ట్రానికి ఉండదు. ఎలాగో చేసేది మోసమే కాబట్టి హామీలు ఇచ్చేస్తున్నారు. నా 8 పథకాలకు రూ.52,700 కోట్లు కావాలి. నేను ఇస్తున్న ఈ స్కీమ్లను టచ్చేసే ధైర్యం ఎవ్వరికీ లేదు. బాబు 6 హామీలు జత చేస్తే లక్షా 26 వేల కోట్లు కావాలి. నేను చాలా కష్టపడితే ఏడాదికి 70 వేల కోట్లు ఇస్తున్నా. మరి చంద్రబాబు ఏటా లక్షా 26వేల కోట్లు ఇవ్వగలరా. చంద్రబాబు ఇస్తున్న హామీలను నమ్మకండి. ఎన్నికలయ్యాక చంద్రబాబు మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేస్తారు. ఈ నిజాలన్నీ వాలంటీర్లు ఇంటింటికీ చెప్పాలి. ప్రజలు మోసపోకుండా వాలంటీర్లే అవగాహన కల్పించాలని సీఎం పిలుపునిచ్చారు.
మన సైన్యం సిద్ధం కావాలి : చంద్రబాబు కూటమిని ఎదుర్కొనేందుకు మన సైన్యం సిద్ధం కావాలని ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు కుట్రలను ప్రజలకు తెలియజేయాలని, అబద్దాల యోధులను మట్టి కరిపించాలన్నారు. వాలంటీర్లు నా సైన్యం. మన యువ సైన్యం రాబోయే రెండు నెలలు యుద్దానికి సిద్ధం కావాలి. మన స్టార్ క్యాంపెయినర్లు అవ్వా, తాతలు, రైతులు. గతంలో చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. మన ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని, మన చొక్కా చేతులు మడత పెట్టాల్సిన సమయం వచ్చేసిందన్నారు. చంద్రబాబు వస్తే చంద్రముఖీలు వస్తాయని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. ఎల్లో మీడియా అసత్య ప్రచారాల మీద యుద్దానికి సిద్ధమే. 58 నెలల పాలనలో వ్యవస్థలో మార్పు వచ్చిందంటే వాలంటీర్లే కారణం. ఒక్క జగన్ ఒక్క వైపు, మరో వైపు దుష్టచతుష్టయం ఉంది. మంచి చేశాం కాబట్టే ప్రజల్లోకి వెళ్తున్నాం. మన పాలనలో పేదలకు సొంతింటి కల సాకారం చేశాం. వాలంటీర్ల వ్యవస్థ అంటే చంద్రబాబుకు కడుపు మంట. చంద్రబాబుకు ఓటు వేయడం అంటే ఐదేళ్ల కింద వదిలించుకున్న చంద్రముఖిని మళ్లీ ఇంటికి పిలిపించుకోవడమేనని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు.
2.60 లక్షల మంది వాలంటీర్లే సైన్యం : రాష్ట్రంలోని 2.60 లక్షల మంది వాలంటీర్లే తన సైన్యం అని ఏపీ జగన్ అన్నారు. చంద్రబాబు జన్మభూమి కమిటీలు గంజాయి మొక్కలైతే మన సచివాలయ వ్యవస్థ తులసి మొక్క అని చెప్పారు. మన పథకాలకు వాలంటీర్లే బ్రాండ్ అంబాసిడర్లు అని అన్నారు. పేదలకు సేవ చేయడానికే మన వ్యవస్థలు పుట్టుకొచ్చాయని జగన్ చెప్పారు. మన వ్యవస్థల ద్వారా ప్రతి గ్రామంలో ఆసుపత్రులు, స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. అక్కాచెల్లెమ్మలు, అవ్వాతాతలు, రైతులకు వాలంటీర్ల వ్యవస్థ తోడుగా ఉందని చెప్పారు. సూర్యుడు ఉదయించక ముందే ఇంటి తలుపు తట్టి వాలంటీర్లు పెన్షన్లను అందిస్తున్నారని కొనియాడారు.