మహేష్ కు జనసేన నగర అధికార ప్రతినిధి షేక్ గయాసుద్దీన్ (ఐజా) సవాల్
విజయవాడ : గతంలో రూహుల్లా అనే ఆటో డ్రైవర్ వద్ద నుంచి తాను 87 వేల రూపాయలు మోసం చేసి తీసుకున్నట్లు చేసిన ఆరోపణలను దమ్ముంటే పోతిన మహేష్ నిరూపించాలని, అలా చేస్తే తాను రాజకీయాల నుంచి విరమించుకుంటానని, లేదంటే మహేష్ రాజకీయ సన్యాసం తీసుకోవాలని జనసేన నగర అధికార ప్రతినిధి షేక్ గయాసుద్దీన్ (ఐజా)సవాల్ చేశారు. శుక్రవారం భవానిపురం లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐజా మాట్లాడుతూ ఈనెల ఏడో తేదీన తాను చేసిన రథయాత్ర విజయవంతం కావడాన్ని చూసి ఓర్వలేక పోతిన మహేష్ రెండేళ్ల క్రితం రూహుల్లా చెప్పిన మాటలను వక్రీకరించి మార్ఫింగ్ వీడియో పెట్టారని ధ్వజమెత్తారు. తన సంపాదనలో 80 శాతం పేద ప్రజలకు ఇస్తున్నానని, వేలాది మందికి సాయం అందజేస్తున్నానని, గత వినాయక చవితికి తాను ఎనిమిది లక్షల రూపాయల విరాళాలు ఇచ్చానని చెప్పారు. తాను కేవలం 87 వేల రూపాయల గురించి రుహుల్లాను మోసం చేసినట్లు అడ్డగోలు ఆరోపణలు చేయడానికి పోతిన మహేష్ కు సిగ్గుండాలని అన్నారు. తమను వీడియోను తీసి మార్ఫింగ్ చేసిన విషయమై మహేష్ ను అడగడానికి మహేష్ కార్యాలయానికి రుహుల్లా కుటుంబం వెళ్లగా వారిపై దాడి చేసి ఫోన్లు పగలగొట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేష్ లాగా తాను బ్యాంకులకు బకాయిలు ఎగ్గొట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ కమిషనర్ ఆఫీస్ కు బాధితులను తీసుకువెళ్లి అక్కడే తేల్చుకుందాం రమ్మంటూ సవాల్ చేశారు. జనసేన పార్టీ ఆశయాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్న తనపై నింద వేస్తే జనసేన పార్టీ పై ,పవన్ కళ్యాణ్ పై నిందలు వేసినట్లే అని హెచ్చరించారు. పార్టీ కోసం తాను గతంలో ఘర్ ఘర్కో జనసేన కార్యక్రమాన్ని రూపొందించగా దాన్ని కాపీ కొట్టిన మహేష్ ఇంటింటికి అంటూ తిరుగుతున్నాడని అన్నారు.