ఎన్టీఆర్ జిల్లా, మైలవరం:-
మైలవరం పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ (సేనా తెలుగు దినపత్రిక) రిపోర్టర్ బి.బాలు రెండు రోజుల క్రితం ప్రమాదానికి గురై గాయాలవ్వడం జరిగింది. ఈరోజు (శుక్రవారం) ఉదయం ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ (ఏపీఎంపిఏ) ఉమ్మడి కృష్ణా జిల్లాల ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పసుపులేటి చైతన్య, జిల్లా నాయకులు మల్లెల శ్రీనివాసరావు, మైలవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బి.విజయ్ బాబు సభ్యులతో కలసి బాలు నివాసంలో ఆయనను పరామర్శించారు. యూనియన్లకు అతీతంగా జర్నలిస్ట్లుఆపదలో ఎవరూ ఉన్న వారికి అండగా ఏపీఎంపిఏ ఉటుందని చైతన్య అన్నారు. అనంతరం యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరామ్ యాదవ్ బాలుని ఫోన్లో పరామర్శించారు ప్రెస్ క్లబ్ ఆఫ్ మైలవరం అధ్యక్షుడు మురళిబాబు, మైలవరం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి జి.నాగరాజు, కోశాధికారి వి.వెంకట్, నియోజకవర్గ యూనియన్ నాయకులు ఎమ్.రవికుమార్, క్లబ్ సభ్యులు ఎమ్.తిరుపతిరావు, వి.జమలయ్య పరామర్శించిన వారిలో ఉన్నారు.