ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కో- ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ వి.ఎ.ఆర్.కె. ప్రసాద్
విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ అనుబంధ సంస్థ” అయిన “ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కో- ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్” సభ్యులకు పంపిణీ చేసిన నికర ఋణాలు రూ.100 కోట్లకు, టర్నోవర్ రూ.190 కోట్లకు చేరుకొని ప్రగతిపథంలో పయనిస్తున్నదని ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కో- ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ వి.ఎ.ఆర్.కె. ప్రసాద్ తెలిపారు. బ్రాహ్మణుల ఆర్ధిక అవసరాలు తీర్చడంలో, అతి తక్కువ వడ్డీకి ఋణాలు అంద చేయటంలో ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కో- ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ముందంజలో ఉందన్నారు. ఇప్పటికి 75,000 మందికి పైగా సభ్యులతో, 16 శాఖలతో రూ. 32 కోట్ల సభ్యుల డిపాజిట్లతో కొనసాగుతూ సభ్యత్వపరంగా రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రాధమిక పరపతి సంఘంగా సొసైటీ గుర్తింపు సాధించింది. సొసైటీ ద్వారా వివిధ రకాల ఋణాలను బ్రాహ్మణుల ఆర్థిక అవసరాలు తీర్చటానికి అతి తక్కువ వడ్డీపై సులభతరంగా మంజూరు చేయటం జరిగిందన్నారు. ఇందులో మహిళాసాధికారత కోసం “అరుంధతి” గ్రూపు ఋణ పధకం ద్వారా 2019-2020 నుండి 2023- 2024 ఇప్పటి వరకు 7,526 బ్రాహ్మణ మహిళా గ్రూపులకి (22,578 మందికి) ఋణాలు రూ.50.25 కోట్లు, పురుషుల స్వయం ఉపాధికి “వశిష్ట” గ్రూపు ఋణ పధకం ద్వారా 4,523 గ్రూపులకు (13,569 మందికి) రూ. 26.85 కోట్లు ఋణాలు మంజూరు చేయటం జరిగిందన్నారు. పురోహితులు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు “పురోహిత మిత్ర” పధకం క్రింద నలుగురు పురోహితులు గల ఒక్కొక్క గ్రూపుకి రూ.1,60,000 చొప్పున 2019-2020 నుండి 2023- 2024 ఇప్పటి వరకు 1325 గ్రూపులకి (5300 మంది పురోహితులకి) రూ. 25.88 కోట్ల రూపాయలు ఋణాలు మంజూరు చేయటం జరిగిందని తెలిపారు. సకాలంలో చెల్లించిన వారికి రెండవసారి రూ.3,20,000 చొప్పున ఋణాలు మంజూరు చేయటం జరుగుతున్నదన్నారు. “అర్చకమిత్ర” పధకం ద్వారా 157 మంది అర్చకులకు 5.12 కోట్లు, “సత్యదేవ సేవ మిత్ర” పధకం ద్వారా 181 మంది అన్నవరం వ్రత పురోహితులకు 5.48 కోట్లు ఋణాలు మంజూరు చేయటం
జరిగిందని చెప్పారు. బ్రాహ్మణులలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను తయారు చేసేందుకు ఒక్కొక్కరికి రూ.2,00,000 చొప్పున ఇప్పటికి 902 మందికి రూ.17.67 కోట్ల రూపాయలు “బ్రాహ్మణ బిజినెస్ లోస్” క్రింద మంజూరు చేయటం జరిగిందని, సకాలంలో చెల్లినచిన వారికి రెండవ ఋణం క్రింద రూ.5.00 లక్షల ఋణం మంజూరు చేయడం జరుగుతుందన్నారు ” ఆచార్య మిత్ర” పథకం ద్వారా 580 ప్రైవేటు టీచర్లకు రూ. 2.22 కోట్లు, “సమాచార మిత్ర” పథకం ద్వారా 98 మంది జర్నలిస్ట్ లకు రూ.36.50 లక్షలు వ్యక్తిగత ఋణాలు మంజూరు చేయటం జరిగిందని, తమ ఆస్తి తనఖాపై “మార్టిగేజి” ఋణాలు 300 మందికి రూ.36.81 కోట్లు మంజూరు చేయటం జరిగిందన్నారు. ప్రభుత్వ రంగ విభాగాలలో పనిచేయు ఉద్యోగులకు “ఎంప్లాయీ పర్సనల్” ఋణాలు ఒక్కొక్కరికి వారి అర్హతపై రూ.10,00,000 వరకు 131 మందికి రూ.7.22 కోట్ల రూపాయలు మంజూరు చేయటం జరిగిందన్నారు. అలాగే ఉన్నత విద్య అభ్యసించేవారికి “విద్యా భారతి” పధకం క్రింద 2019-2020 నుండి 2023-2024 ఇప్పటివరకు 30 మందికి రూ. 1.54 కోట్లు ఋణాలు మంజూరు చేయబడును. అలాగే జగనన్న ఇల్లు మంజురైన బ్రాహ్మణులకు, వారికి ఇళ్ళు కట్టుకొనుటకు రూ.3,00,000/- వరకు ఋణం మంజూరు చేస్తున్నాము. మధ్య తరగతి బ్రాహ్మణులకు స్థలం / ఇల్లు కొనుగోలు నిమిత్తం ఋణాలు సొసైటీ ద్వారా మంజూరు చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో సొసైటీ ద్వారా బ్రాహ్మణులకి మరింత మెరుగైన సేవలు అందించటానికి కృషి చేస్తామని తెలిపారు. సొసైటీ అభివృధి లో తోడ్పాటు అందిస్తున్న పేరి కామేశ్వరరావు, చైర్మన్, ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ కు, సంఘ అభివృద్ధికి కృషి చేసిన పూర్వ చైర్మన్ లకు, సొసైటీ పూర్వ చైర్మన్ లకు, మెంబర్లకు, అధికారులకు, ఉద్యోగులకు, వివిధ బ్రాహ్మణ సంఘాలకు ప్రత్యేక ధన్యవాదాలు. నాకు సొసైటీ చైర్మెన్ గా పనిచెయ్యటానికి ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 100 కోట్ల నికర ఋణాలు సాధించిన ఈ సంఘం రాబోయే 3 సంవత్సరాలలో రూ.500 కోట్ల టర్నోవర్ కు చేరుతుందని, బ్రాహ్మణుల ఆర్థిక అభివృద్ధికి విశేష కృషి చేస్తామని ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కో- ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ వి.ఎ.ఆర్.కె. ప్రసాద్ తెలిపారు.