గుంటూరు : తెలుగు భాష విశ్వవ్యాప్తికి అధికార భాషా సంఘం, ఆంధ్ర ప్రదేశ్ తెలుగు సంఘం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో తెలుగు పత్రికా రంగంలో లబ్ద ప్రతిష్టలైన సంపాదకులు, రచయితలు, జర్నలిస్టులు 30 మందికి తెలుగు భాషారత్న సాఫల్య, తెలుగు భాష సేవారత్న పురస్కారాల ప్రదానం వైభవోపేతంగా జరిగింది. వీరిలో సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు చలపతిరావు ఉన్నారు. సభా నంతరం సహచర జర్నలిస్టులు నిమ్మరాజును సత్కరించారు. అధికార భాషాసంఘం అధ్యక్షుడు, కార్యక్రమ రథసారథి పి విజయబాబు అధ్యక్షతన జరిగిన ఈ బృహత్తర కార్యక్రమంలో సి ఆర్ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య రాజశేఖర్, విశ్రాంత ఆచార్యులు పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ , ఆంధ్ర తెలుగు సంఘం చైర్మన్ మేడపాటి వెంకట్, సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, జర్నలిజం విభాగాధిపతి ప్రొఫెసర్ జి అనిత, అకాడమీ కార్యదర్శి మామిడిపల్లి బాలగంగాధర్ తిలక్ తదితరులు పాల్గొన్నారు.