కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్.
పదోవ తరగతి లో మంచి మార్కులు సాధిస్తే తల్లిదండ్రులుకు బిడ్డ ఇచ్చే గిఫ్ట్ అని మండల సచివాలయాల కన్వీనర్ మాదాసు యజ్ఞ పవన్ చెప్పారు. కలువాయి మండలం కుల్లూరు గవర్నమెంట్ హై స్కూల్ విద్యార్థులకు సోమవారం మాదాసు గంగాధరం నలినమ్మ దంపతుల తనయుడు మండల సచివాలయాల కన్వీనర్ మాదాసు యజ్ఞ పవన్ విద్యార్థులకు అల్పాహారము పంపిణీ చేశారు. ఈ సందర్బంగా పాఠశాల ఉపాధ్యాయులు అయన ను శాలువా సత్కరించారు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ…ఎస్ ఎస్ సి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఇప్పటి నుండి ఎగ్జామ్ మొదలయ్యే వరకు ప్రతిరోజు సాయంత్రం అల్పాహారం అందించడం జరుగుతుందన్నారు. ఇక్కడ చదువుకునే విద్యార్థులందరూ పేద మధ్య తరగతి కుటుంబాల నుండి వచ్చిన విద్యార్థులే అని తెలిపారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని, మన స్కూలులో చదివిన విద్యార్థులు పెద్ద,పెద్ద చదువులే చదివి మంచి గుర్తింపు పొందిన మంచి హోదాలలో ఉన్నారన్నారు. అందరూ కష్టపడే చదివి మంచి మార్కులు తెచ్చుకొని, తల్లిదండ్రులకు, స్కూల్ కి ఉపాధ్యాయులకు, మంచి పేరు తీసుకురావాలని అని తెలిపారు, ఈ కార్యక్రమంలో, మండల విద్యాశాఖ అధికారి బాలకృష్ణారెడ్డి -సర్పంచ్ అంకయ్య, ఉప సర్పంచ్ సీనయ్య సీనియర్ ఉపాధ్యాయులు పెంచల నరసింహులు, ఉపాధ్యాయులు, వైయస్ఆర్ సీపీ నాయకులు, సురేష్ రెడ్డి, సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు.