మునుగోడు : తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా ఎదురుచూసిన మునుగోడు ఉప ఎన్నికలో తెరాస సత్తా చాటింది. సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై దాదాపు దాదాపు 10వేల ఓట్లకుపైగా మెజార్టీతో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. 2, 3 రౌండ్లు మినహాయిస్తే తొలి రౌండ్ నుంచి తెరాస అభ్యర్థి ఆధిక్యం ప్రదర్శించారు. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ మునుగోడులో డిపాజిట్ కోల్పోయింది. తెరాస ఘనవిజయం సాధించడంతో ఆపార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మునుగోడుతో పాటు తెలంగాణ భవన్ వద్ద తెరాస శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచి హర్షం వ్యక్తం చేశారు.