అమరావతి: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీనటుడు చిరంజీవికి దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుల్లో ఒకటైన పద్మవిభూషణ్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. వారికి తన అభినందనలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లో పద్మ అవార్డులను దక్కించుకున్న వారికి ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు.