అమరావతి : భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 26వ తేది శుక్రవారం ఉ.8 గం.లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ భవనం ప్రాంగణంలో శాసన మండలి అధ్యక్షులు కె.మోషేన్ రాజు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.
ఉ.8.15 గం.లకు రాష్ట్ర అసెంబ్లీ భవనం వద్ద రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.
సచివాలయం మొదటి బ్లాకు వద్ద : సచివాలయం మొదటి బ్లాకు వద్ద శుక్రవారం ఉ.7.30 గం.లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.
రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వద్ద : నేలపాడులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వద్ద శుక్రవారం ఉ.10 గం.లకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింఘ్ ఠాకూర్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.