హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులు రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారు. దీనిలో భాగంగా 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు వివరాలను సీఎంకు అందించారు. విస్తరణలో భాగంగా జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్డు వరకు మెట్రో మార్గాన్ని పొడిగించనున్నారు. కొత్తగా మరో నాలుగు కారిడార్లలో నిర్మాణం చేపట్టనున్నారు.
ప్రతిపాదించిన మెట్రో మార్గాలివే
కారిడార్ 2: ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్‌నుమా వరకు – (5.5 కి.మీ)
కారిడార్ 2: ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్డు వరకు – (1.5 కి.మీ)
కారిడార్ 4: నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు (నాగోల్-ఎల్బీనగర్-చాంద్రాయణగుట్ట-మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఎయిర్‌పోర్టు వరకు) – (29కి.మీ)
కారిడార్ 4: మైలార్‌దేవ్‌పల్లి నుంచి ప్రతిపాదించిన హైకోర్టు వరకు – (4 కి.మీ)
కారిడార్ 5: రాయదుర్గం నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు (రాయదుర్గం-నానక్‌రామ్‌గూడ-విప్రో జంక్షన్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు) – (8 కి.మీ)
కారిడార్ 6: మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు (మియాపూర్-బీహెచ్ఈఎల్-పటాన్చెరు) – (14 కి.మీ)
కారిడార్ 7: ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ (ఎల్బీనగర్-వనస్థలిపురం-హయత్‌నగర్) వరకు – (8కి.మీ)