అమరావతి : ఈసీ ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను సస్పెండ్ చేస్తూ సీఎస్ జవహర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో హెడ్ క్వార్టర్ విజయవాడను వదిలి వెళ్లొద్దని సీఎస్ ఆదేశించారు. ఎపిక్ కార్డుల డౌన్లోడ్ వ్యవహారంలో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో అప్పటి ఆర్వోగా గిరీషా వ్యవహరించారు. రిటర్నింగ్ అధికారిగా ఆయన లాగిన్ దుర్వినియోగ పరిచారని అభియోగం నమోదైంది. మరో ఐఏఎస్, ఐపీఎస్ మీద కూడా ఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.